ఇక నుంచి రోజుకోసారి కరోనా టెస్ట్ చేయించుకుంటా : ట్రంప్

ఇక నుంచి రోజుకోసారి కరోనా టెస్ట్ చేయించుకుంటా : ట్రంప్
x
Donald Trump(File photo)
Highlights

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను రోజూ కోవిడ్ 19‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటానని ట్రంప్‌ అన్నారు.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను రోజూ కోవిడ్ 19‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటానని ట్రంప్‌ అన్నారు. వైట్ హౌస్ లో విధులు నిర్వర్తిస్తోన్న ట్రంప్ వ్యక్తిగత సహాయకుడికి వైరస్‌ సోకడమే అందుకు కారణం. కాగా.. అధ్యక్షుడి వద్ద పనిచేసే సిబ్బందికి రోజూ పరీక్షలు చేస్తూనే ఉన్నారు.

ఇన్నిరోజులుగా వారానికి ఒకసారి టెస్టులు చేయించుకున్నాం. ఇక‌ నుంచి రోజూ ఒకసారి చేయించుకుంటాం. శ్వేతసౌథంలో వైరస్‌ సోకిన వ్యక్తితో నేను అంత సన్నిహితంగా లేను. అతడు మంచి వ్యక్తి. అని తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. ట్రంప్‌, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌కు కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని అధికారిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే ఈ సమావేశం వారు మాస్క్‌లు ధరించకపోవడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories