చైనాను వదిలేది లేదు.. మరోసారి డోనాల్డ్ ట్రంప్ సీరియస్

చైనాను వదిలేది లేదు.. మరోసారి డోనాల్డ్ ట్రంప్ సీరియస్
x
Donald Trump(File photo)
Highlights

చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరూపారేసుకున్నారు.

చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరూపారేసుకున్నారు.గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళికి చైనా తప్పిదం వల్లే ప్రపంచానికి ఈ దుస్థితి తలెత్తిందని ఎట్టి పరిస్తితుల్లో డ్రాగన్‌పై కఠిన ఆంక్షలు విధించాలని కోరుతున్నారు.మరోవైపు చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ప్రధానంగా రిపబ్లిన్‌ పార్టీ ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైరస్‌ ముమ్మాటికీ చైనా కారణంగా వచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఆఫ్రికన్‌-అమెరికన్‌ నేతలతో జరిగిన మిషిగన్‌లో సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. చైనాతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని.. కానీ, కొన్ని రోజులకే చైనా నుంచి వైరస్‌ నిరాశకు గురి చేసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ తో అమెరికా అతలాకుతలం అవుతుంది. ఈ మహమ్మరి బారి నుంచి పోరాడుతూ మరణించిన వారి సంఖ్య 95వేలు దాటిన నేపథ్యంలో వారందరికీ సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా 3 రోజులు జాతీయ జెండాను అవనతం చేయాలని ట్రంప్‌ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories