America: అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది మృతి

America: అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది మృతి
x
Highlights

America: అగ్రరాజ్యం అమెరికాలో భయానక ప్రమాదం చోటుచేసుకుంది. టెన్నెస్సీ రాష్ట్రంలోని హంఫ్రీస్ కౌంటీలో ఉన్న ఒక పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ విస్ఫోటనం జరిగింది.

America: అగ్రరాజ్యం అమెరికాలో భయానక ప్రమాదం చోటుచేసుకుంది. టెన్నెస్సీ రాష్ట్రంలోని హంఫ్రీస్ కౌంటీలో ఉన్న ఒక పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 19 మంది మృతి చెందారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్లాంట్‌లో సైనిక, అంతరిక్ష, వాణిజ్య రంగాలకు అవసరమైన ఎక్స్‌ప్లోసివ్ మెటీరియల్స్ తయారు చేస్తారు. ప్రమాదం సంభవించగానే ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొంది.

హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ మాట్లాడుతూ ..

“ఇది చాలా పెద్ద, వినాశకరమైన పేలుడు. ప్రమాదం తర్వాత చాలా మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. కొంతమంది మాత్రమే సురక్షితంగా ఉన్నారు, మిగిలిన వారు మరణించి ఉండవచ్చు,” అని చెప్పారు. పేలుడు తీవ్రత అంతగా ఉండటంతో, సమీపంలోని ఇళ్లు, వాహనాలు కూడా కదిలిపోయాయి. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీ భవనం పూర్తిగా శిథిలాల కుప్పగా మారింది.

ప్రమాద స్థలంలో మంటలు, దుమ్ము, పొగ వ్యాపించడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అధికారులు ఘటన స్థలాన్ని మూసివేసి దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మృతుల సంఖ్యపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories