ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి

ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి
x
Highlights

అమెరికాలో ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. 24గంటల్లో తొలి డోస్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి మన దగ్గర సంగతి ఏంటి ? కరోనా...

అమెరికాలో ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. 24గంటల్లో తొలి డోస్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి మన దగ్గర సంగతి ఏంటి ? కరోనా వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడు ! ఏర్పాట్లు జరుగుతున్నాయ్ సరే... వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేందుకు ఎంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయ్ ? ఎలాంటి అంచనాలు వినిపిస్తున్నాయ్ ?

కరోనా సెకండ్ వేవ్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. పెరుగుతున్న కేసులు భయపెడుతున్న మరణాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయ్. ఇలాంటి సమయంలో చాలాకళ్లు టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయ్. ఇక అమెరికాలో అయితే పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. భారీగా మరణాలు కనిపిస్తున్నాయ్ అక్కడ ! ఇలాంటి తరుణంలో ఫైజర్ వ్యాక్సిన్‏ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఎఫ్‌డీఏ ఆమోదం తెలపగా దీనికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 24గంటల్లోపు మొదటి టీకా డోసును ఇస్తామని తెలిపారు. ఎవరెవరికి ఈ టీకా మొదటి డోసును అందించాలో గవర్నర్లు నిర్ణయిస్తారన్నారు.

ఇండియాలోనూ కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా వైరస్ విజృంభణ ఆగడం లేదు. టీకాకు సంబంధించి సీరం సంస్థ కీలక అంశాన్ని చెప్పింది. డిసెంబర్ నెలాఖరులోనే ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అత్యవసర లైసెన్స్ పొందవచ్చనే ఆశాభావాన్ని ఆ సంస్థ సీఈఓ అదార్‌ పూనావాలా వ్యక్తం చేశారు. ఆమోదం తర్వాత, జనవరి నెలలోగా ఇండియాలో టీకా పంపిణీ స్టార్ట్ చేయొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యవసర వినియోగానికి రెగ్యులేటర్ల అనుమతి, ఆ తర్వాత దేశంలో టీకా డ్రైవ్ 2021, జనవరి నాటికి ప్రారంభం అవుతాయన్నారు. 2021 అక్టోబర్ నాటికి చాలామందికి వ్యాక్సిన్ వేయడం పూర్తవుతుందని దీంతో మాములు పరిస్థితులు నెలకొంటాయని అన్నారు.

తొలిదశలో దేశ జనాభాలో 20 నుంచి 30శాతం మందికి వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రణాళికలు రచిస్తోందని పూనావాలా అన్నారు. జూలై 2021నాటికి 3వందల నుంచి 4వందల మిలియన్ మోతాదులను సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వివరించారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు మార్కెట్లకు కూడా టీకాల తయారీకి తాము రెడీ అవుతున్నామని పూనావాలా చెప్పారు. ఐతే వైరస్ కారణంగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. ఇలాంటి తరుణంలో త్వరగా టీకా రావాలన్న ఆశలు రోజురోజుకు పెరుగుతున్నాయ్. ఐతే వరుస ప్రకటనలు చూస్తుంటే మహమ్మారి అంతానికి సమయం దగ్గర పడిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories