ప్రభుత్వ ఇంటి కోసం తల్లినీ, చెల్లినీ కూడా పెళ్లి చేసుకున్న ఘనుడు!

ప్రభుత్వ ఇంటి కోసం తల్లినీ, చెల్లినీ కూడా పెళ్లి చేసుకున్న ఘనుడు!
x
Highlights

ప్రభుత్వ పథకాలు.. వాటి అమలు తీరుపై చర్చ మనకి కొత్త కాదు. అనర్హులకు పథకాలు చేరిపోవడం.. అర్హులు ఎప్పటిలానే బీదరికంలో మగ్గిపోవడం మనకి తెలీనిదీ కాదు....

ప్రభుత్వ పథకాలు.. వాటి అమలు తీరుపై చర్చ మనకి కొత్త కాదు. అనర్హులకు పథకాలు చేరిపోవడం.. అర్హులు ఎప్పటిలానే బీదరికంలో మగ్గిపోవడం మనకి తెలీనిదీ కాదు. ఒక్కోసారి ఒకే థకాన్నిరెండు మూడు సార్లు తీసుకున్న వాళ్ళూ ఉన్నారు. కానీ, చైనాలో ఓ ప్రబుద్ధుడు తన కుటుంబంతో కల్సి ఒకే పథకాన్నిఏకంగా 23 సార్లు సాధించాడు. నమ్మశక్యం కాని రీతిలో ఆ వ్యక్తీ చేసిన ఘరానా మోసం ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది.

అదిరిపోయే ప్లాన్..

చైనాలోని జెజియాంగ్‌లో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా అక్కడి అక్కడ ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు 40 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అపార్టుమెంట్ ఫ్లాట్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా మంది ఆ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ పథకం నుంచి అధికంగా లబ్ది పొందాలనే దురాశతో పాన్ అనే వ్యక్తీ అదిరిపోయే ప్లానేశాడు. అసలు ఎవరూ ఊహించలేని పధకంతో అక్కడి అధికార్లను బురిడీ కొట్టించాడు.

పాన్ అనే వ్యక్తికి తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. దాంతో అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే, తిరిగి ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. ఆమె ప్రభుత్వ పథకం ప్రవేశపెట్టిన జెజియాంగ్ ప్రాంతానికి చెందింది. ఈ పునర్వివాహంతో పాన్ కు ప్రభుత్వ అపార్ట్మెంట్ మంజూరు అయింది. ఇక్కడితో మనోడి ప్లాన్ అయిపోలేదు. తరువాత ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఇప్పుడు తన చెల్లిని వివాహం చేసుకున్నాడు. ఆమెకీ విడాకులు ఇచ్చేశాడు. తరువాత తన తల్లినీ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకూ విడాకులు ఇచ్చేశాడు. అటు తరువాత మరదల్ని వివాహం చేసుకున్నాడు. మళ్లీ అదే తంతు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే మనోడి తండ్రి కూడా అదే విధంగా తన కుటుంబంలోని మహిళలను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశాడు. ఇలా ఇద్దరూ కల్సి 23 వివాహాలు చేసుకున్నారు.

ఇలా పెళ్లి చేసుకుంటే పథకం అందుతుందా అంటే.. అవును.. ఆ పథకం లో ఉన్న ఓ నిబంధన అందుకు వీలు కల్పించింది. ఎక్కడైతే పునరావాస పథకం అమలు చేస్తున్నారో ఆ ప్రాంతానికి చెందిన వారిని పెళ్లి చేసుకున్న వారు ఆ ప్రాంతానికి చెందిన వారిగానే పరిగనిస్తారు. పైగా ఒంటరి మహిళలకు ఆ పథకం కచ్చితంగా అమలు చేయాలి. దీంతో విడాకులు తీసుకున్న వెంటనే ఆయా మహిళలు ఒంటరి వారిగా పథకం ద్వారా లబ్ది పొందారు. ఈ నిబంధన లోని లొసుగు పట్టుకుని తన ఇంట్లో ఉన్న మహిళలు అందర్నీ ఆ ప్రాంతం వారిని చేసేశాడు పాన్. తద్వారా అందరికీ అపార్ట్మెంట్స్ దక్కేలా చేసుకున్నాడు.

మరి ఎలా దొరికారు..

అతి ఎప్పుడూ సమస్య తెస్తుంది కదా. అదే జరిగింది ఈ విషయంలో అత్యాశకు పోయి వరుసగా పథకాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నించడంతో పాన్ కుటుంబం దొరికిపోయింది. అకస్మాత్తుగా లబ్దిదారులు పెరిగిపోయిన విషయాన్ని అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో తీగ లాగారు పాన్ అపార్ట్మెంట్ కదిలింది.

అదండీ సంగతి. ప్రభుత్వ పతకాలను మేసేసే ఉద్దండులు ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇక ఈ విషయాన్ని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 11 మంది కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో నలుగురు ఇంకా కస్టడీలో ఉండగా మిగిలిన నిందితులు బెయిల్ మీద విడుదలయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories