మాస్క్ పెట్టుకోనని మారాం చేసిన చిన్నారి.. విమానం నుంచి ఆ ఫ్యామిలీని దింపేసిన సిబ్బంది...

మాస్క్ పెట్టుకోనని మారాం చేసిన చిన్నారి.. విమానం నుంచి ఆ ఫ్యామిలీని దింపేసిన సిబ్బంది...
x
Highlights

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కరోనాను తరిమికొట్టాలంటే మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ప్రపంచమంతా చెప్తూనే ఉంది. బస్సుల్లో,...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కరోనాను తరిమికొట్టాలంటే మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ప్రపంచమంతా చెప్తూనే ఉంది. బస్సుల్లో, విమానాల్లో ఎక్కడ ఉన్న మాస్క్ తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే యూఎస్ కు చెందిన ఒక చిన్నారి మాస్క్ పెట్టుకోలేదని విమానం నుంచి కిందకు దింపేశారు. ఆమెతో పాటు ఆమె ఫ్యామిలీని కూడా కిందకు దింపేసి అవమానించారు. ఈ సీన్‌ను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై నెటిజన్‌లు మండిపడుతున్నారు.

యూఎస్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలోని సిబ్బంది ప్రయాణికుల పాలిట ఘోరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వేలాది మంది ఎయిర్‌లైన్స్ వైఖరిపై తీవ్రంగా మండిమడుతున్నారు. ఎలిజ్ అర్భన్ అనే యువతి, తన భర్త, రెండు సంవత్సరాల బిడ్డతో కలిసి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ లో ప్రయాణించేందుకు విమానం ఎక్కింది.

విమానంలో మాస్క్ పెట్టుకోవాలన్న నిబంధన ఉండగా, ఎలిజ్ అర్బన్ రెండేళ్ల కూతురు తనకు మాస్క్ వద్దని మారాం చేసింది. పాప తండ్రి ఎంతగా బలవంతం చేసినా, ఆ చిన్నారి వినలేదు. ఇంతలో విమానం సిబ్బంది ఒకరు వచ్చి, పాపను తీసుకుని కిందకు దిగాలని సూచించారు. తాను బిడ్డ ముఖం పై మాస్క్‌ను ఉంచానని, పాప కొంత మారాం చేస్తుందని, కాసేపట్లో సర్దుకుంటుందని చెప్పి చూశాడు. కానీ, విమానం సిబ్బంది వినలేదు చివరకు విమాన సిబ్బంది బలవంతం చేయడంతో వారు కిందకు దిగాల్సి వచ్చింది.

ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన వారంతా యునైటెడ్ ఎయిర్ లైన్స్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. విమానంలో తాము అత్యంత అవమానాన్ని ఎదుర్కొన్నామని, ఏమాత్రం కనికరం లేకుండా తమను బలవంతంగా దించేశారని ఆ పై జీవితాంతం తాము యునైటెడ్ ఎయిర్ లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించారని ఎలిజ్ కన్నీరు పెట్టుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories