మరి కొన్ని గంటలు.. మన గుండెల్లో మంటలు.. అసలు డిసెంబర్‌ 25,26న ఏం జరగబోతోంది?

మరి కొన్ని గంటలు.. మన గుండెల్లో మంటలు.. అసలు డిసెంబర్‌ 25,26న ఏం జరగబోతోంది?
x
Highlights

ఖగోళంలో మరో అద్భుతాన్ని మనం చూడబోతున్నామ్‌. విశ్వంలో మరో విశేషాన్ని గ్రహాలు ఆవిష్కరించబోతున్నాయ్‌. ప్రళయం తప్పదని కొందరు అంటున్నారు మరికొందరు యుగాంతం...

ఖగోళంలో మరో అద్భుతాన్ని మనం చూడబోతున్నామ్‌. విశ్వంలో మరో విశేషాన్ని గ్రహాలు ఆవిష్కరించబోతున్నాయ్‌. ప్రళయం తప్పదని కొందరు అంటున్నారు మరికొందరు యుగాంతం ఖాయమంటున్నారు. ఏమైనా కొన్ని గంటలే మన బతుకులు అన్న మాటలూ వినిపిస్తున్నాయ్‌. షష్టగ్రహ కూటమి ప్రకృతి ఒడిలో గూటమి దింపబోతోందని కొందరు చెబుతున్నారు. గ్రహాల కలయిక జరిగిన కొన్ని గంటల్లోనే సూర్యగ్రహణం. అసలేం జరగబోతోంది? డిసెంబరు 25, 26 తేదీల్లో రాబోయే ప్రళయం ఏంటి?

మరి కొన్ని గంటలు... మన గుండెల్లో మంటలు.

షష్ట గ్రహ కూటమా...ప్రకృతి ఒడిలో గూటమా?

ప్రళయం సమీపిస్తోందా... యుగాంతం కాబోతోందా?

ఆరు గ్రహాల కలయిక విశేషమా.... జీవుల అంతు చూసే ఉపద్రవమా?

ఇక కొన్ని గంటలేనా మన బతుకులు ఇంతకీ భయాలేంటి.... అపోహలేంటి?

ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. ఆరు గ్రహాలు ఒకేరాశిలో కలబోతున్నాయ్‌. మరి ఇక ప్రళయమేనా..? విశ్వంలో ఇప్పటివరకూ ఇలాంటిది జరగలేదని కొందరు అంటున్నారు. దీనిపై ఖగోళ పండితులు, జ్యోతిషులు తలలు పట్టుకుంటున్నారు. ఒకేసారి ఆరు గ్రహాలు కలుస్తున్నాయ్‌. అదీ ఒకే రాశిలో. ఇది ఆ అరుదైన విశేషం. ఇలాటి అరుదైన అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడటం మన అదృష్టమనుకోవాలా జరగబోయే పరిణామాలను తలుచుకొని బాధపడలా?

డిసెంబరు 25 సాయంత్రం 4.41 గంటల నుంచి 27వ తేదీ రాత్రి 11.40 గంటల వరకూ షష్టి గ్రహ కూటమి కనిపించబోతోంది. ప్రకృతిలో జరగబోయే విపత్తేంటి? రాజకీయాలు, ప్రపంచ పరిణామాలపై చూపే ప్రభావం ఏమిటి? ఆ సమయంలో పుట్టే పిల్లల భవిష్యత్తు ఏమిటి? రాశులవారీగా చూపించే ప్రభావం ఎంత? గురుడు, శని, కేతువులు ఇప్పటికే ధనుస్సు రాశిలో కలసి ఉన్నాయ్‌. దీనికి తోడుగా బుధుడు, రవి, చంద్రుడు వచ్చి కలుస్తున్నాయ్. మరి ఈ ఫలితాల్ని ఎలా అంచనా వేయాలి.?

ఇలాంటి అద్భుతం వందేళ్ల క్రితం ఇలా ఏర్పడింది కొందరు చెబుతున్నారు. లేదు లేదు 297 ఏళ్ల క్రితం ఇలా కనిపించిందంటున్నారు ఇంకొందరు. అబ్బే అలాంటిదేమీ లేదు. అసలు ఇలాంటిది గతంలో ఎన్నడూ చూడలేదని మరికొందరు వివరిస్తున్నారు. ఏమైనా ఏదో జరగబోతున్నదనే ప్రచారం ప్రజలు వెంటాడుతున్నాయ్‌. వాస్తవానికి గోచారంలో పంచ గ్రహకూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ లేదా సప్త గ్రహ, అష్ట గ్రహకూటమి జరిగినప్పుడు ఫలితం ఏ విధంగా ఉంటుదో కచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయ్‌ కాబట్టి అంచనా వేయడం నిజంగా కష్టమైన పనే. అందులోనూ గోచార ఫలితాలు కేవలం 20 శాతం వరకు మాత్రమే మానవులపై ప్రభావం చూపే అవకాశాలుంటాయ్‌. ఆయా రాశుల్లో జన్మించిన వారికి ఈ కూటమి ఏర్పడే స్థానాన్ని బట్టి ఫలితంలో మార్పు ఉంటుంది తప్ప అన్ని రాశుల వారికి చెడు ఫలితం ఇస్తుంది అనుకోవటం కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు. అంతేకాకుండా ఈ ఫలితాలు ఏవైనా కూడా అవి కొత్తగా వచ్చేవి కాదు. ఎందుకంటే అంతకు పది రోజుల ముందు సూర్యుడు, 50 రోజులకు ముందు గురువు ధనుస్సులోకి వచ్చి వాటి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించారు కాబట్టి. ఈ కూటమి వలన కొత్తగా జరిగే చెడు గాని మంచిగాని ఏది అయినా నామమాత్రంగానే ఉంటుందన్నది మరికొందరి అభిప్రాయం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories