అమెరికాలో కొలువుదీరిన హనుమాన్ విగ్రహం

అమెరికాలో కొలువుదీరిన హనుమాన్ విగ్రహం
x
Highlights

తెలుగోడి ప్రతిభ అమెరికాలో విరాజిల్లింది. గుండె నిండా దాచుకున్న భక్తిని సప్త సముద్రాలు దాటించారు. 25 అడుగుల ఎత్తు 30 టన్నుల బరువు ఉన్న అజనేయస్వామి భారీ...

తెలుగోడి ప్రతిభ అమెరికాలో విరాజిల్లింది. గుండె నిండా దాచుకున్న భక్తిని సప్త సముద్రాలు దాటించారు. 25 అడుగుల ఎత్తు 30 టన్నుల బరువు ఉన్న అజనేయస్వామి భారీ విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్టించి హిందూ సంప్రదాయాన్ని అగ్రరాజ్యానికి పరిచయం చేశారు.

అమెరికాలోని డెలావర్ రాష్ట్రంలో అంజనేయస్వామి విగ్రహం కొలువుదీరింది. సుమారు 25 అడుగుల ఎత్తూ ముప్పై టన్నుల బరువు ఉండే ఈ విగ్రహాన్ని వరంగల్ నుంచి సప్త సముద్రాలు దాటించి అమెరికా తీసుకెళ్లారు. కరీంనగర్‌కు చెందిన రాజు తన టీంతో కలిసి ఈ విగ్రాహాన్ని రూపొందించారు. 12 మంది సభ్యులు సుమారు ఆరు నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని చెక్కినట్లు రాజు తెలిపారు.

గత జనవరిలో ఈ విగ్రహాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరానికి షిప్ ద్వారా తరలించారు. అక్కడి నుంచి ట్రక్ ద్వారా డెలావర్ రాష్ట్రంలోని హాకేస్సన్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ హిందూ భక్తుల అంతా కలిసి ఎంతో అంగరంగ వైభవంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. పదిరోజులు పాటు ఈ ప్రతిష్టపన కార్యక్రమం జరిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories