Indonesia: జకార్తాలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

Indonesia: ఇండోనేసియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 10 Dec 2025 11:33 AM IST
Indonesia: జకార్తాలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
X

Indonesia: జకార్తాలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

Indonesia: ఇండోనేసియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఓ భవనం మొదటి అంతస్తులో ఉన్న డ్రోన్ల కంపెనీ గోదాంలో బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని 22 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో గర్భిణితో సహా 15 మంది మహిళలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలు సమీప భవనాలకు వ్యాపించడంతో అక్కడ ఉంటున్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. డ్రోన్‌ బ్యాటరీలో షార్ట్‌ సర్క్యూట్‌, థర్మల్‌ వైఫల్యం ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story