అమెరికాలో 'కోవిడ్ -19' తో 11 మంది భారతీయులు మృతి.. వారిలో..

అమెరికాలో కోవిడ్ -19 తో 11 మంది భారతీయులు మృతి.. వారిలో..
x
Highlights

అమెరికాలో కోవిడ్ -19 తో 11 మంది భారతీయులు మరణించారు, మరో 16 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రాణాంతక సంక్రమణకు గురైన భారతీయ పౌరుల్లో ఎక్కువగా పురుషులు ఉన్నారు.

అమెరికాలో కోవిడ్ -19 తో 11 మంది భారతీయులు మరణించారు, మరో 16 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రాణాంతక సంక్రమణకు గురైన భారతీయ పౌరుల్లో ఎక్కువగా పురుషులు ఉన్నారు.వారిలో పది మంది న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. బాధితుల్లో నలుగురు వ్యక్తులు న్యూయార్క్ నగరంలో టాక్సీ డ్రైవర్లుగా తెలుస్తోంది.

కరోనావైరస్ కారణంగా ఒక భారతీయ జాతీయుడు ఫ్లోరిడాలో మరణించినట్లు తెలిసింది. కాలిఫోర్నియా మరియు టెక్సాస్ రాష్ట్రాల్లోని మరికొందరు భారతీయ సంతతి ప్రజల జాతీయతను కూడా అధికారులు నిర్ధారిస్తున్నారు.

కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన నలుగురు ఆడవారితో సహా మొత్తం 16 మంది భారతీయులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వారిలో ఎనిమిది మంది న్యూయార్క్, ముగ్గురు న్యూజెర్సీ మిగిలిన వారు టెక్సాస్, కాలిఫోర్నియా వంటి ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు.

వారు భారత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చారు. కోవిడ్ -19 తో బాధపడుతున్న భారతీయ పౌరులు, విద్యార్థులకు అవసరమైన సహాయం అందించడానికి యునైటెడ్ స్టేట్స్ అంతటా.. భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్లు స్థానిక అధికారులు, భారతీయ-అమెరికన్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి.

ఇక న్యూయార్క్ నగరం కోవిడ్ -19 కు కేంద్రంగా అవతరించింది, ఇక్కడ 6,000 మందికి పైగా మరణించారు, అంతేకాదు 1,38,000 పైగా ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇక న్యూజెర్సీలో 1,500 మరణాలు , దాదాపు 48,000 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పటివరకు మొత్తం 14,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయాయి, యుఎస్ లో నాలుగు లక్షల మందికి పైగా ఈ వైరస్ తో బాధపడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories