రష్యాలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో కేసులు చూస్తే..

రష్యాలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో కేసులు చూస్తే..
x
Highlights

రష్యాలో ఆదివారం వరుసగా 10,000 కొత్త కేసులను నమోదు అయ్యాయి.

రష్యాలో ఆదివారం వరుసగా 10,000 కొత్త కేసులను నమోదు అయ్యాయి. ఈ వారంలో 10 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది మూడవసారి. మొదట్లో కరోనా ప్రభావం అంతగా లేని రష్యాలో గత నెలరోజులుగా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 281,752 కు చేరింది. కరోనా కేసులలో రష్యా ఇప్పుడు రెండవ స్థానంలో ఉండగా.. ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ తరువాత రెండవ అత్యంత వేగంగా కొత్త ఇన్ఫెక్షన్ల రేటును కలిగి ఉంది. గత 24 గంటల్లో తొంభై నాలుగు మంది మరణించారు, దీంతో రష్యాలో మొత్తం మరణాల సంఖ్య 2,631 కు చేరుకుంది. మొత్తం కేసులలో 67 వేల మంది కోలుకున్నారు.

ఇక అధిక సంఖ్యలో కేసులు ఉన్నప్పటికీ, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఇటలీ , స్పెయిన్ వంటి దేశాలతో పోలిస్తే రష్యా అధికారిక కరోనావైరస్ మరణాల రేటు తక్కువగా ఉంది. 6 మిలియన్లకు పైగా పరీక్షలు జరపడంతో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయని రష్యా తెలిపింది. మొత్తం అంటువ్యాధులలో మాస్కోలో సగం వాటా ఉంది.. వైరస్ వ్యాప్తిని మందగించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ సడలించనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వారం ప్రకటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories