5 రోజుల్లోనే 10 వేల ఒంటెలను చంపబోతున్నారు.. ఒంటెలను చంపేందుకు హెలికాఫ్టర్ల వినియోగం

5 రోజుల్లోనే 10 వేల ఒంటెలను చంపబోతున్నారు.. ఒంటెలను చంపేందుకు హెలికాఫ్టర్ల వినియోగం
x
5 రోజుల్లోనే 10 వేల ఒంటెలను చంపబోతున్నారు
Highlights

ఆస్ట్రేలియా ఇప్పుడు కార్చిచ్చు కారణంగా దయనీయ పరిస్థితిలోకి జారుకుంది. అత్యధిక శాతం భూభాగాన్ని కార్చిచ్చు దహించివేసింది. మిగతా ప్రాంతాలకు కూడా...

ఆస్ట్రేలియా ఇప్పుడు కార్చిచ్చు కారణంగా దయనీయ పరిస్థితిలోకి జారుకుంది. అత్యధిక శాతం భూభాగాన్ని కార్చిచ్చు దహించివేసింది. మిగతా ప్రాంతాలకు కూడా పాకుతుండడంతో ప్రజలు లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సుమారు 10 వేల ఒంటెలను చంపాలని కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం 5 రోజుల్లోనే 10 వేల ఒంటెలను చంపబోతున్నారు.

ఆస్ట్రేలియాలో పరిస్థితులు దయనీయంగా మారాయి. కార్చిచ్చు కారణంగా వేడిని భరించలేక ఒంటెలు జనావాసాల్లోకి చొరబడి అధికంగా నీటిని తాగేస్తుండడంతో వాటిని హతమార్చాలని భావిస్తున్నారు. పైగా ఒంటెలు ఇళ్లకు వేసిన ఫెన్సింగ్ లను సైతం ధ్వంసం చేస్తూ నీటి వనరులను పాడుచేస్తున్నాయి. నీళ్ల కోసం ఇళ్లకు అమర్చిన ఏసీలను సైతం ధ్వంసం చేస్తున్న ఘటనలు కూడా జరిగాయి. ప్రజల కనీస అవసరాలకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యాలు, భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్న ఆస్ట్రేలియా సర్కారు ఒంటెలను చంపేందుకు హెలిక్టార్లను కూడా ఏర్పాటు చేసింది.

దక్షిణ ఆస్ట్రేలియాలో అనేక గిరిజన తెగలకు ఆలవాలమైన A.P.Y అనే ప్రాంతంలో ఒంటెలను చంపివేయనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన ఒంటెలను నిపుణులు హెలికాఫ్ట్రర్లలో నుంచి కాల్చి చంపనున్నారు. అసలే నీటి కొరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూగజీవాలు విపరీతంగా నీరు త్రాగేస్తున్నాయని అందువల్లే వీటిని చంపాలనే కఠిన నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒంటెలను కాల్చివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రూపాల్లో తన నిరసన తెలయజేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories