Modi: కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది.. అన్ని రంగాల్లో దేశం ముందుకెళ్తోంది

Modi: గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకొచ్చాం

Shekhar G
Published on: 15 Aug 2023 8:58 AM IST
Corona Has Taught Us Many Lessons Says Modi
X

Modi: కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది.. అన్ని రంగాల్లో దేశం ముందుకెళ్తోంది

Modi: కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత్‌పై సరికొత్త విశ్వాసం ఏర్పడిందన్నారు. కరోనా సమయంలో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లామని గుర్తు చేశారు. ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని..దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం అవసరమన్నారు. గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకొచ్చామని...అన్ని రంగాల్లో దేశం ముందుకెళ్తోందని ప్రధాని మోడీ తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story