ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ టాప్‌

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ టాప్‌
x
Highlights

ఐటీ రంగంలో మరోసారి తన మార్క్‌ చూపింది తెలంగాణ. వరుసగా ఐదోసారి ఐటీ ఎగుమతుల్లో నెంబర్‌ వన్‌‌గా నిలిచింది. ఈ మేరకు వార్షిక నివేదికను సీఎం కేసీఆర్‌కు...

ఐటీ రంగంలో మరోసారి తన మార్క్‌ చూపింది తెలంగాణ. వరుసగా ఐదోసారి ఐటీ ఎగుమతుల్లో నెంబర్‌ వన్‌‌గా నిలిచింది. ఈ మేరకు వార్షిక నివేదికను సీఎం కేసీఆర్‌కు అందించారు మంత్రి కేటీఆర్‌. కరోనా కష్ట కాలంలోనూ అద్భుతంగా పని చేశారంటూ ఐటీ శాఖను అభినందించారు సీఎం కేసీఆర్.

లాక్‌డౌన్ సందర్భంగా ఐటీ కంపెనీలన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతిని పాటించడంతో ఐటీ శాఖ ఎగుమతుల్లో 17.93 శాతం గ్రోత్ సాధించింది తెలంగాణ. ఈ ఘనత సాధించినందుకు సీఎం కేసీఆర్ ఐటీ శాఖను అభినందించారు. గత ఐదేళ్లుగా దేశంలో ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉండగా, లాక్‌డౌన్ పరిస్థితుల్లో కూడా తన ఉనికిని చాటుకుంది.

ఐటీ ఎగుమతుల్లో దేశ సగటు 8.09 శాతం ఉండగా, మిగతా రాష్ట్రాల సగటు 6.92% గా నమోదైంది. మొత్తం భారతదేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం 11.6 శాతాన్ని ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం ఐటీ వృద్ధి వల్ల తెలంగాణలో ఉపాధి కల్పనలో గతేడాది కంటే 7.2 శాతం వృద్ధి సాధించింది. దీంతో ఐటీ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందంటూ ఐటీ నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఒక పక్క తమ సంస్థ పనులు తాము చేసుకుంటూనే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఐటీ కంపెనీలు చాలా అద్భుతంగా పని చేశాయని సీఎం కేసీఆర్ అభినందించారు. ఐటీ కంపెనీలన్నీ కలిసి కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి చేయూతనివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 70 కోట్ల విలువైన పీపీఈ కిట్లతో పాటు ప్రస్తుత సమయంలో అత్యవసరమైన వెంటిలేటర్లు కూడా ఐటీ కంపెనీలు సమకూర్చాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories