ఒప్పంద సేద్యంతో రైతుకు ఆర్ధిక భరోసా

ఒప్పంద సేద్యంతో రైతుకు ఆర్ధిక భరోసా
x
Highlights

ఈ రోజుల్లో వ్యవసాయం లాభదాయకమైన వృత్తి కాద, పండిన పంటకు సరైన గిట్టుబాటు రాదు. ఎరువులు, పురుగు మందలు, విత్తనాలు , వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగిపోవడం,...

ఈ రోజుల్లో వ్యవసాయం లాభదాయకమైన వృత్తి కాద, పండిన పంటకు సరైన గిట్టుబాటు రాదు. ఎరువులు, పురుగు మందలు, విత్తనాలు , వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగిపోవడం, దళారుల దోపిడి, సగటు రైతుకు సకాలంలో రుణ సదుపాయం లభించకపోవడం, వర్షాభావం మొదలైన ప్రతికూలాంశాలు అన్నదాత నడ్డి విరుస్తున్నాయి. ఎన్నో వేల మంది ఆత్మహత్యలు చేసుకోవడం, లక్షలాది కుటుంబాలు వీధిన పడటం, చివరకు గ్రామీణ వ్యవస్థ చితికిపోతోంది ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కార్పొరేట్ వ్యవసాయం మినహా గత్యంతరం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. రైతుల గతి, వ్యవసాయ స్థితిని మార్చే కార్పొరేట్ వ్యవసాయం పై ప్రత్యేక కథనం

సన్న, చిన్నకారు రైతులకు గిట్టుబాటు ధరపై పూర్తి భరోసా కల్పించేదే కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ అదే కార్పొరేట్ వ్యవసాయం. రైతు పంట వేయడానికి ముందే ఆ పంటను కొనుగోలు చేస్తామని కార్పొరేట్‌ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటాయి. పంట చేతికి వచ్చినప్పుడు మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటే పెరిగిన ధరకే కొనుగోలు చేస్తాయి. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం అనే సమస్యే ఉత్పత్తి కాదు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానాన్ని కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు అనుసరిస్తున్నాయి. కాంట్రాక్టు ఫార్మింగ్‌ విధానం వల్ల సన్న, చిన్న కారు రైతులకు ప్రయోజనకరంగా ఉందని నిరూపిస్తున్నాయి.

భారత్ లో అతి పెద్ద పరిశ్రమ వ్యవసాయమే, హెడ్ ఆఫీస్ లేని కంపెనీ, ప్రతి ఊళ్లో ఉద్యోగులు ఉంటారు యజమాని, ఉద్యుగులు అనే తేడా లేదు,రైతులు, కూలీలు కలిసికట్టుగా పనిచేస్తారు. నిర్ణీత పనివేళలంటూ ఉండవు,చేయాలే కానీ 24 గంటలూ పనే..17 శాతం దేశ సంపదను సృష్టిస్తున్నది వ్యవసాయమే,50 శాతం ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది వ్యవసాయమే. ఏటా 284.83 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తులను అందిస్తోంది భారత్. బియ్యం, గోధుమలు, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో మనది 7 వ అతి పెద్ద దేశం. అయితే ఘనంగా చెప్పుకోవడానికే ఈ రంగం ఉంది కానీ, రైతును కదిపితే అన్నీ కన్నీటి కథలే వినిపిస్తాయి. భారత్‌లో 22.5 శాతం మంది రైతులు ఇప్పటికీ దారిద్ర్యరేఖకు దిగువనే బతుకుతున్నారు.

పల్లెల్లోని రైతు సగటు సంపాదన నెలకు 8 వేలు మాత్రమే అంటోంది నాబార్డు. అందులో వాస్తవం కొంతే అన్నదాతల్లో 52.5 శాతం మంది ఇప్పటికీ అప్పుల్లోనే మగ్గిపోతున్నారు. నీతి అయోగ్ అధ్యయనం ప్రకారం గడిచిన 23 ఏళ్లల్లో రైతు ఆదాయం 9.18 రెట్లు పెరిగిందని చెబుతున్నప్పటికీ, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. అన్నదాత ఆదాయం రెండింతలు కావడానికి 23 సంవత్సరాలు పట్టింది. రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ఉచిత విద్యుత్ ఊరటనివ్వడం లేదు రుణమాఫీతో రుణం తీరడం లేదు, సబ్సిడీలతో చావులూ ఆగడం లేదు, పెట్టుబడి సాయం అందినా, గిట్టుబాటు దక్కడం లేదు.

పండ్లను నేరుగా సూపర్ మార్కెట్‌కు చేరవేస్తే, రైతుకు ఎంతో కొంత ఊరట లభిస్తుంది ఒక పండ్ల దిగుబడి అనే కాదు. బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు, ఆకుకూరలు ఇలా పండిన పంటను మండీలకు తీసుకెళతారు రైతులు అక్కడ దళారులు, వ్యాపారులు చెప్పిన రేటుకే అమ్మాలి గిట్టుబాటు కాకపోతే వెనక్కి తీసుకెళ్లడం అదనపు భారం మంచి ధర పలికే వరకు నిల్వ చేయడమూ సాధ్యం కాదు దీనివల్ల పండించే రైతుకు గిట్టుబాటు దక్కదు. వినియోగదారునికీ ధరలు అందుబాటులో ఉండవు ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపేందుకే వచ్చింది ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్.

ఇందులో కార్పొరేట్ ప్రయోజనమే అధికమైనా రైతుకు ఎంతోకొంత ఊరటనిచ్చే అంశమే ఇన్నేళ్లూ వ్యవసాయ ఉత్పత్తులను మండీలు, మార్కెట్ విక్రయ కేంద్రాల్లోనే అమ్మేవారు రైతులు ఇప్పుడు నేరకుగా రిటైల్‌స్టోర్లు, సూపర్‌మార్కెట్లు, కార్పొరేట్ కంపెనీలే రైతుల వద్దకు వెళుతున్నాయి. ఇదివరకు ఎన్నడూ లేని కొత్త మార్పు ఇది.

ఒకప్పుడు బత్తాయి, బొప్పాయి, దానిమ్మలను తోపుడు బండ్ల మేదే కొనేవాళ్లం. ఇప్పుడవన్నీ సూపర్ మార్కెట్‌లకు చేరాయి. అమ్మకాలు కూడా ఆశించిన దానికంటే ఎక్కువే జరుగుతున్నాయి. కాబట్టి రైతుల వద్దకే కంపెనీలు వెళ్లి కొనుగోలు చేస్తే తప్ప వినియోగదారకులకు సరిపడేంత సరుకును అందించలేవు. దీంతో మార్కెట్‌లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఒకప్పుడు పొలాల్లో పంటలు పండేవి, ఇప్పడు కార్పొరేట్ ఆలోచనలు పండుతున్నాయి. కంపెనీలే పొలంలోకి అడుగుపెడుతున్నాయి. దీనివల్ల అటు సంస్థకు, ఇటు రైతులకు లాభాలు పండుతున్నాయి. వ్యవసాయంలో వస్తున్న ఈ కొత్త మార్గం వైపు రైతులు ఆసక్తిగా చూస్తున్నారు. భారత్ లో ఇప్పటికే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపనీలు ఈ కాంట్రాక్ట్ విధానాన్ని అవలంభిస్తూ దేశ విదేశాలకు మన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. రైతులకు ఆర్ధిక భరోసాను కల్పిస్తున్నారు.

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా గ్రూప్‌కు రిటైల్ వ్యాపారంలో ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలో పండే రుచికరమైన, నాణ్యమైన ద్రాక్షను విదేశాలకు ఎగుమతి చేయడంలో దిట్ట ఈ కంపెనీ 12 ఏళ్ల కిందట మన ద్రాక్షను తిరస్కరించేవి కొన్ని దేశాలు. పరిమితికి మించి క్రిమి సంహారక మందులు వాడటమే ప్రధాన కారణం. రైతులు చేసేది లేక స్థానిక మార్కెట్‌లలో కిలో పాతిక రూపాయలకు అమ్ముకునేవారు. ద్రాక్ష ఎగుమతుల్లోకి మహీంద్రా వచ్చాక ఎంతో మార్పు వచ్చింది. ఆ సంస్థ ప్రత్యేకంగా నియమించుకున్న వ్యవసాయ నిపుణులతో రైతులకు శిక్షణ ఇప్పిస్తోంది. అతి తక్కువ రసాయనాల వాడకంతోనే అధిక పంటలు ఎలా పండించాలో అవగాహన కల్పిస్తోంది. ద్రాక్ష తోటల రైతులతో ఒక అంగీకారానికి వచ్చి పంట దిగుబడిని కొనుగోలు చేస్తోంది. ఏటా ఎంతలేదన్నా 15వేల టన్నుల ద్రాక్షను విదేశాలకు పంపిస్తోంది మహీంద్రా. మన దేశం నుంచి వెళ్లే ద్రాక్ష ఎగుమతుల్లో కంపెనీది 12 శాతం వాటా. ప్రస్తుతం ఈ కంపెనీ నాసిక్ ప్రాంతంలనే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్‌ను అమలు చేస్తోంది. రైతుల కోసం ప్రత్యేకించి మై అగ్రి గురు యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఆరు లక్షల మంది రైతులు యాప్‌ను వాడుతున్నారు.

ప్రఖ్యాత ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఐటీసీ కూడా రైతుల భాగస్వామ్యానికి పెద్ద పీట వేసింది. సుమారు 10 రాష్ట్రాల్లోని పలు పల్లెల్లో కియోస్క్‌లను ఏర్పటు చేసి రైతులకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 35 వేల పల్లెల్లో 40 లక్షల మంది వీటితో అనుసంధానమయ్యారు. కియోస్క్‌ల ద్వారా వ్యవసాయ సమాచారం, వాతావరణ విశేషాలు, మార్కెట ధరలు వంటివన్నీ తెలుసుకోవచ్చు. ఐటీసీ రైతులతో ఒప్పందం చేసుకుని బియ్యం, సోయా, గోధుమలు, పప్పులు, బార్లీ, పండ్లు సేకరిస్తోంది. వీటిని శుద్ధి చేసి వినియోగదారులకు సరసమైన ధరలకు అందిస్తోంది. సేంద్రియ తోటల్లో పండిన మామిడి, జామ, బొప్పాయి, దానిమ్మ పండ్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. పండ్ల నుంచి ప్యూరీ తీసి అమ్ముతోంది. కాఫీ వ్యాపారాన్ని కూడా ఎప్పటి నుంచో చేస్తోంది. దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. మార్కెట్‌లో ఆశించిన ధర అందుతోంది. దేశంలోనే రెండో అతి పెద్ద ఎగుమతుల సంస్థ ఐటీసీ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ను వేగంగా ముందుకు తీసుకెళుతోంది.

కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్స్‌కు వెళితే ప్రెంచ్ ఫ్రైస్ తినకుండా వెనక్కి రారు చాలా మంది. కొత్తతరం ఆహార అభిరుచుల్లో వచ్చిన మార్పు ఇది. సినిమా థియేటర్లు , కెఫెటేరియాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఇలాంటి ఫుడ్‌కు గిరాకీ ఎక్కువ. వీటిని తయారు చేయడానికి నాణ్యమైన బంగాళ దుంపలు అవసరం. దీంతో పంట సాగుకు రైతులకు సహాయపడుతోంది అగ్రీ సర్వీసెస్ కంపెనీ ఈఎం3. గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ఇప్పటికే పని మొదలుపెట్టింది. బంగాళదుంపల ఆహార ఉత్పత్తులు అందించే ఎంసీకైన్‌తో ఒప్పందం పెట్టుకుంది. పంటను సాగు చేసే రైతులకు విత్తనాలు, ఎరువులు, మందులు, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక సాయం ఒకటేమిటి, సమస్తం అందిస్తోంది. రైతులు పండించిన పంటను తిరిగి కొనుగోలు చేస్తోంది. సేద్యంలో ఆధునిక సాంకేతికతను వాడటం వల్ల 25 శాతం ఖర్చు తగ్గడమే కాకుండా 20 శాతం దిగుబడి పెరిగింది. అని ఈఎం3 సంస్థ చెబుతోంది.

భారత్‌లో కొబ్బరి నూనె వాడకం ఎక్కువ. అందులోనూ పారాచూట్ కొబ్బరి నూనెకు ఎప్పటి నుంచో మంచి బ్రాండింగ్ ఉంది. కొబ్బరి తోటలున్న రైతులతో మారికో సంస్థ ఒప్పందం చేసుకుంది. కొబ్బరి పరిశోధన విశ్వవిద్యాలయాల సూచనలు, నిపుణుల సలహాలను రైతులకు అందిస్తోంది. మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా కనీసం పదివేల మంది వ్యవసాయదారులకు అవగాహన కల్పించనుంది. మహీంద్రా, మారికో వంటి సంస్థలే కాదు ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్‌లోకి ఇతర రంగాలకు చెందిన కంపెనీలు కూడా వరుస కడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి సంస్థ అదానీ ఆపిల్ పండ్లను ఎగుమతి చేస్తోంది. ఈ రంగంలో పరిశోధన అభివృద్ధిలలో పెట్టుబడులు కూడా పెడుతోంది.

ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్‌లోకి స్టార్టప్‌ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చురుగ్గా పనిచేసే కంపెలే సుమారు 250 వరకు ఉన్నట్లు ఈ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. కొన్ని యాప్స్ ఆన్‌లైన్ ద్వారా కూరగాయలు, పండ్లు విక్రయిస్తున్నాయి. ఈ కంపెనీలకు స్థానిక రైతుల ద్వారానే దిగుబడి వస్తుంది. కొన్ని సంస్థలైతే రైతులకు పశుబీమా,పంటల బీమాలత పాటు ఆధునిక వ్యవసాయ పరికరాల పట్ల అవగాహన కల్పిస్తున్నాయి. రుణాల కోసం ప్రాజెక్టు రిపోర్టులను తయారు చేసి పెడుతున్నాయి.

వ్యవసాయంలో రైతులు ఎప్పుడూ లాభాలను కళ్ల చూడడం లేదు వ్యాపారంలో ఒట్టి ఐడియాల మీద పెట్టుబడులు పెట్టే వారు ఉన్నారు కానీ వ్యవసాయంలో మట్టి మీద పెట్టుబడి పెట్టేవారు లేరు. చావైనా, బతుకైనా భూమిని నమ్ముకున్న ఏకైక శ్రమజీవి రైతు. అలాంటి వారికి కాస్త ఆసరాను, ఆర్ధిక భరోసాను కల్పిస్తోంది కార్పొరేట్ వ్యవసాయం గిట్టుబాటు రాక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒప్పంద సేద్యం ద్వారా అప్పుల పాలు అయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నారు రైతులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories