Rains: 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు: ఐఎండీ

Rains: రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కరుస్తాయని ఐఎండీ తెలిపింది.

Venkata Chari
Updated on: 13 Jun 2021 5:30 PM IST
Weather Forecast in Telugu States
X

వర్షం (ఫొటో దిహన్స్ ఇండియా)

Rains: రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కరుస్తాయని ఐఎండీ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల రెండు మూడు రోజుల్లో ఇది మరింత బలపడొచ్చని ఐఎండీ తెలిపింది. అలాగే ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణించే అవకాశముందని పేర్కొంది.

దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. అలాగే ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఓ ప్రకటనలో పేర్కొంది.

Venkata Chari

Venkata Chari

Next Story