Top
logo

వ్యవసాయం నుండి చేపల పెంపకం వైపు

వ్యవసాయం నుండి చేపల పెంపకం వైపు
X
Highlights

వ్యవసాయమే పరమావధిగా పంటల సాగు చేసే రైతులకు కష్ట నష్టాలే ఎక్కువ లాభాదాయక పంటలు వేసినా లాభాలు దరి చేరని...

వ్యవసాయమే పరమావధిగా పంటల సాగు చేసే రైతులకు కష్ట నష్టాలే ఎక్కువ లాభాదాయక పంటలు వేసినా లాభాలు దరి చేరని పరిస్థితి. ఈ నేపథ్యంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, నూతన పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకంలో లాభాలు గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతు. మిశ్రమ విధానంలో అయిదు రకాల చేపలను పెంచడమే కాకుండా, చేప పిల్ల విత్తనాలను సైతం సాగు చేస్తున్నాడు. ఆక్వా రంగంలోని నిపుణుల ద్వారా సాగు మెళుకువలను తెలుసుకొని నేడు లాభాల బాట పట్టిన సూర్యాపేట జిల్లాకు చెందిన కొమెర సురేష్ అనే మత్స్యరైతు విజయగాథపై ప్రత్యేక కథనం.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన రైతు కొమెర సురేష్, 10 ఏళ్లుగా చేపల సాగు చేపడుతున్నారు. కుటుంబ నేపథ్యం కూడా వ్యవసాయమే అవడంతో చేపల పెంపకానికి ముందు 20 ఎకరాల్లో వరి సాగు చేసేవారు. అయితే నాగర్జున సాగర్ కాలువ పోలానికి సమీపంలోనే ప్రవహించడం, నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో పొలాన్ని చేపల చెరువుగా మార్చి స్వయంగా చేపలు సాగు చేయడం మొదలెట్టారు రైతు సురేష్. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు రైతులు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటే చేపల చెరువుల మీద మంచి లాభాలు వస్తాయని, కేవలం పంట సాగు మీదనే ఆధారపడకుండా నీటి లభ్యత ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చు అంటున్నారు రైతు సురేష్. చేపల పెంపకంలోని మరిన్ని అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Web TitleSuryapet Farmer Success Story in Fish Farming
Next Story