వానాకాల సాగుకు సిద్ధం అవుతున్న అన్నదాతలు

Rice growers preparing for the rainy season
x

వానాకాల సాగుకు సిద్ధం అవుతున్న అన్నదాతలు 

Highlights

Rainy Season: *ఎరువులు, విత్తనాలు కోసం ఎదురు చూపులు

Rainy Season: వానా కాలం వస్తుండటంతో అన్నదాతలు సాగుకు సిద్ధం అవుతున్నారు. యాసంగి పంటల సీజన్ ముగియడంతో దుక్కులు దున్నుతూ పొలాలను సిద్దం చేసుకుంటున్నారు. వర్షాలు కూడా అధికంగా కురిస్తే పంటల సాగు విస్తీర్ణం మరింత పెరుగతుందని అధికారులు అంచా వేస్తున్నారు. అయితే రైతులు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది కంటే అధిక విస్తీర్ణంలో పత్తిని సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో పత్తి ప్రధాన పంటగా సాగు కానుంది.

పంటల సీజన్ ప్రారంభం అవుతున్నా అందుకు తగిన ఎరువులు, యూరియా అందుబాటాలో లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కంపెనీల నుంచి రైల్వే వ్యాగన్లు రాకపోవడంతో యూరియా సరఫరా నిలిచిపోయిందని.. తామేమి చేయలేమని ఎరువుల డీలర్లు రైతుల దగ్గర నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పొటాష్ కూడా అందుబాటులో లేకపవోడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో సొసైటీలకు మార్క్ ఫెడ్ అరువు పద్దతిలో ఎరువులు, యూరియాను సరఫరా చేసేవి. తమకు వచ్చిన ఎరువులు, యూరియా విక్రయించి ఆ సొమ్మును మార్క్ ఫెడ్ సొసైటీలకు చెల్లించేవి. అయితే ముందుగాన ఎరువులు, యూరియాకు నగదు చెల్లించాలని.. అలా అయితేనే వాటిని సరఫరా చేస్తామని.. అరువు పద్దతిపై ఇచ్చే ప్రసక్తి లేదని మార్క్ ఫెడ్ అధికారులు ఇటీవలు సొసైటీలకు సర్క్యూలర్ ఇచ్చింది.

ఒక యూరియా లోడ్ కు సొసైటీల నుంచి మూడు లక్షలు చెల్లించాలి. డీఏపీ ఇతర కాంప్లెక్స్ ఎరువులు ఒక లోడ్ కు పది లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇంత సొమ్ము ముందుగానే మార్క్ ఫెడ్ కు చెల్లించే ఆర్ధిక వెసులు బాటు సొసైటీలకు లేదు . తాము ఏమీ చేయలేమని పాలకవర్గాలు చేతులెత్త్తేస్తున్నాయి. అంతే కాకుండా వీటి విక్రయంతో మార్క్ ఫెడ్, డీసీసీబీలకు మాత్రమే లాభం వస్తుంది. తప్ప తమ సంఘాలకు ఏమీ మేలు చేకూరడం లేదని సొసైటీ పాలకవర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా లేక రైతులు గొగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంకం తగి నచర్యలు తీసుకొని యూరియా కొరతను తీర్చాని కోరుతున్నారు.

ఇప్పటికే పెరిగిన ధరలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని పలువురు రైతులు వాపోతున్నారు. వానాకాలం సీడన్ కోసం ప్రస్తుతం జిల్లాలో 30 శాతం ఎరువులు మాత్రమే ఎరువులు అందుబాటులో ఉన్నయని అధికార వర్గాలు చెబుతున్నాయ. దీన్ని బట్టి ఎక్కువ ధరకు కొందామన్నా ఎరువులు దొరకని పరిస్థితి ఏర్పడవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగం కోరుతోంది

Show Full Article
Print Article
Next Story
More Stories