రైల్వే ఉద్యోగం వదిలేసి..బంజరు భూమిలో 'క్యాప్సికమ్' ..ఒక్క పంటతో రూ. 9 లక్షల లాభం

రైల్వే ఉద్యోగం వదిలేసి..బంజరు భూమిలో క్యాప్సికమ్ ..ఒక్క పంటతో రూ. 9 లక్షల లాభం
x

రైల్వే ఉద్యోగం వదిలేసి..బంజరు భూమిలో 'క్యాప్సికమ్' ..ఒక్క పంటతో రూ. 9 లక్షల లాభం

Highlights

చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక కల. అందులోనూ రైల్వే ఉద్యోగం అంటే జీవితం సెటిల్ అయిపోయినట్లే అని భావిస్తారు.

చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక కల. అందులోనూ రైల్వే ఉద్యోగం అంటే జీవితం సెటిల్ అయిపోయినట్లే అని భావిస్తారు. కానీ, రాజస్థాన్‌లోని పాలి జిల్లాకు చెందిన దినేష్ సింగ్ సిసోడియా ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. 20 ఏళ్ల పాటు రైల్వేలో సేవలందించిన ఆయన, మట్టిపై మమకారంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయంలో అడుగుపెట్టారు. నేడు లక్షలాది రూపాయలు సంపాదిస్తూ ఎందరో యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దినేష్ తన ప్రయాణాన్ని అంత సులభంగా ప్రారంభించలేదు. 2017లో ఉద్యోగం వదిలేసిన ఆయన, 2021లో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

అయితే ఆ భూమి సాగుకు ఏమాత్రం పనికిరాని కంకర, రాళ్లతో కూడిన బంజరు నేల. భూమిని బాగు చేయడానికి చెరువు మట్టిని తెప్పించారు.కేవలం మట్టిని పరచడానికే లక్ష రూపాయల వరకు ఖర్చు చేశారు.రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి, ఆవు పేడ వంటి దేశీయ ఎరువులతో భూమిని సారవంతం చేశారు. గుజరాత్‌కు చెందిన తన స్నేహితుడు ఆసిఫ్ సలహాతో దినేష్ క్యాప్సికమ్ సాగును ఎంచుకున్నారు. గుజరాత్ నుండి 10 వేల మొక్కలను తెప్పించి, తన భూమిలో నాటారు.నలుగురు కుమార్తెలు ఉన్నప్పటికీ, రిస్క్ తీసుకుని వ్యవసాయంలోకి రావడం దినేష్ సాహసమనే చెప్పాలి.

2024 సీజన్‌లో సాధించిన ఈ విజయం ఆయనలో మరింత ఉత్సాహాన్ని నింపింది. వచ్చే సీజన్‌లో మొత్తం 3 ఎకరాల్లో క్యాప్సికమ్ సాగు చేసి, భారీ లాభాలు గడించాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయం నా కల. ఉద్యోగంలో ఉన్నప్పుడు సమయం దొరికేది కాదు. ఇప్పుడు నా కల నిజమైంది, అది కూడా ఊహించని లాభాలతో అని దినేష్ గర్వంగా చెబుతున్నారు. కష్టపడే తత్వం, సరైన ప్రణాళిక ఉంటే బంజరు భూమి కూడా సిరి సంపదలను అందిస్తుందని దినేష్ నిరూపించారు. సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు.. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే కోటీశ్వరులు కావచ్చని ఆయన కథ నిరూపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories