Top
logo

పకృతి విధానంలో పందిరి పంటల సాగు..

పకృతి విధానంలో పందిరి పంటల సాగు..
X
Highlights

కూటి కోసం కోటి విద్యలన్నారు మన పెద్దలు, ఈ విషయంలో ముందుగా మనం వ్యవసాయం గురించి మాట్లాడుకోవాలి ఆహారం సమకూర్చుకునే క్రమంలోనే సేద్యం పుట్టింది.. అలా కాలక్రమేణ ఇందులో ఎన్నో మార్పులు వచ్చాయ్. హరితవిప్లవం పేరుతో ఎక్కడ లేని కొత్త పోకడలతో వ్యవసాయాన్ని పూర్తిగా వ్యాపారమయం చేసాం.

కూటి కోసం కోటి విద్యలన్నారు మన పెద్దలు, ఈ విషయంలో ముందుగా మనం వ్యవసాయం గురించి మాట్లాడుకోవాలి ఆహారం సమకూర్చుకునే క్రమంలోనే సేద్యం పుట్టింది.. అలా కాలక్రమేణ ఇందులో ఎన్నో మార్పులు వచ్చాయ్. హరితవిప్లవం పేరుతో ఎక్కడ లేని కొత్త పోకడలతో వ్యవసాయాన్ని పూర్తిగా వ్యాపారమయం చేసాం. అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయనాలని వాడి, అటు నేలను, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ... పెట్టుబడులు పెంచుకుంటూ పోయి రైతులు తమ జీవితాలని కూడా పాడు చేసుకుంటున్నారు. కానీ యాదాద్రి జిల్లాకి చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి ప్రకృతి విధానంలొ సాగు చేస్తూ కొత్త పధ్దతులను అవలంభిస్తున్నారు. యాదాద్రి జిల్లా, మూటకొండూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి గత 15 సంవత్సరాలుగా రసాయన మందులు లేకుండా పంటలను సాగు చేస్తున్నాడు. నేలతో పాటు శరీరాన్ని గుల్ల చేసే రసాయానాల సేద్యాన్ని పక్కన పెట్టి, పోషకాలు కలిగిన

ఆహారన్ని తనకి తన కుటుంబానికే కాకుండా వినియోగదారులకు ఇవ్వాలనే లక్ష్యంగా ప్రకృతి విధానంలొ సాగు ప్రారంభించాడు. ఆర్గానిక్ కూరగాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కానీ వాటిని ప్రకృతి సేద్యంలో పండించటంలో రైతులు కాస్త శ్రమించాల్సివుంటుంది. అలాంటి పని భారాన్ని తగ్గించుకుంటూ దిగుబడిని సాధించేందుకు ఒక్కో రైతు ఒక్కో తీరుగా పంటలను సాగు చేస్తుంటాడు.ఆ విధంగా అంతర పంటలే కాకుండా మిశ్రమ పంటల విధానాన్ని పాటిస్తూ.. తక్కువ స్ధలంలో ఎక్కువ పంటలు సాగు చేస్తున్నారు. గో ఆధారిత వ్యవసాయం చేస్తూ.. జీవామృతం, నీమాస్త్రం వంటి ప్రకృతి విధానంలో తయారు చేసిన కషాయాలనే పంటలకు వాడుతూ పంటలకు పురుగులను ఆశించకుండా పలు రకాల పధ్దతులను అనుసరిస్తున్నారు. వ్యవసాయ భూమిని బట్టి నీటి అవసరం పెరుగుతుంది.కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉంటాయి. ఒక వేళ బోర్లు వేసినా ఆశించిన స్థాయిలో మాత్రం నీటి లభ్యత ఉండదు..అలాంటి సమయంలో ప్రతీ నీటి చుక్క రైతుకు చాలా ముఖ్యం. శ్రీనివాస్ రెడ్డి పొలంలో నీటి లభ్యత తక్కువ కానీ ఫార్మ్ పాండ్ ద్వారా నీటిని నిల్వచేసుకుని డ్రిప్ పద్దతిలో తన 6 ఎకరాలకు సమర్థంగా నీటిని అందిస్తున్నాడు, నీటి వినియోగంలోరైతు తీసుకుంటున్న జాగ్రత్తలు చూదాం.


వ్యవసాయంలో రైతులు తరచు ఎదుర్కొనే సమస్య కూలీల కొరత పంట చేతికొచ్చినా కలుపు లేదా కోతల సమయంలోకూలీల ఖర్చు అధికంగా ఉంటుంది. చిన్న, సన్నకారు ‌రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ సమస్యని ఎదుర్కున్న శ్రీనివాస రెడ్డి సైకిల్ వీడర్ పరికరాన్ని ఉపయోగించి కలుపుని నివారిస్తున్నాడు. మరి ఆ పరికరం పని తీరు ఎలా ఉంటుంది. కలుపు నియంత్రణలో రైతులకి ఎలా వివిధ రకాలుగా పనిముట్టు ఉపయోగిస్తున్నారు భూసారాన్ని కోల్పోకుండా నకిలీ విత్తనాల బెడద లేకుండా మార్కెట్ లో ముందుకు సాగాలంటే దేశి ఆవులు, దేశి విత్తనాలతో ప్రకృతి సేద్యం చెయ్యాలని..పండించిన పంటలకు విలువ పెంచి అమ్ముకోవాలని ఆయన అంటున్నారు. అందుకే తామంత కలసి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి చుట్టూ పక్క గ్రామాల రైతులంతా కలసి ఒకే చోట తమ పంటలు అమ్ముకుంటున్నామని అంటున్నారు.


రసాయనాలు లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ప్రకృతి వ్యవసాయంతోనేసాధ్యమవుతుందని, విత్తన శుద్ధి నుండి పంట కోత వరకు ప్రకృతి సిధ్దంగా వ్యవసాయం చేసినప్పుడే రైతులు లాభపడతారని రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యుడు లక్ష్మణ్ అంటున్నారు. రైతులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తి సంఘం ద్వారా తాము భువనగిరిలో వినియోగదారులకు స్వచ్ఛమైన ప్రకృతి విధానంలో పండించిన కూరగాయలు,పండ్లు విక్రయిస్తున్నామని తెలిపారు.


Next Story