Organic Farming : సేంద్రీయ వ్యవసాయ కూరగాయలను తింటే ఎన్ని లాభాలో..!

Organic Farming : సేంద్రీయ వ్యవసాయ కూరగాయలను తింటే ఎన్ని లాభాలో..!
x

Organic Farming : సేంద్రీయ వ్యవసాయ కూరగాయలను తింటే ఎన్ని లాభాలో..!

Highlights

నేటి కాలంలో మనం తినే ప్రతి ఆహారం కెమికల్ మయం అయిపోయింది. వేగంగా పంట పండాలన్న ఆశతో వాడుతున్న పురుగుల మందులు, రసాయనాలు మన కంచంలోకి విషాన్ని వడ్డిస్తున్నాయి.

నేటి కాలంలో మనం తినే ప్రతి ఆహారం కెమికల్ మయం అయిపోయింది. వేగంగా పంట పండాలన్న ఆశతో వాడుతున్న పురుగుల మందులు, రసాయనాలు మన కంచంలోకి విషాన్ని వడ్డిస్తున్నాయి. అందుకే, 100 ఏళ్లు బతకాల్సిన మనిషి 40 ఏళ్లకే అనారోగ్యంతో కుప్పకూలిపోతున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో మళ్లీ మనల్ని కాపాడగలిగేది ఒక్క సేంద్రీయ వ్యవసాయం మాత్రమే.

సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, అవి అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. పలు అధ్యయనాల ప్రకారం, వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులు మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. అలాగే, మన రోగనిరోధక శక్తిని పెంచి రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.

సేంద్రీయ కూరగాయలు , ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం, ఫైబర్ వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ బాధితులకు ఇది ఒక గొప్ప వరం.వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా అతిగా తినడం తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు.

ఆకుపచ్చని కూరగాయలు జీర్ణవ్యవస్థను క్లీన్ చేసి మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను దూరం చేస్తాయి.మాంసాహారం తినని వారు ఈ కూరగాయలను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు మరియు విటమిన్ బి-కాంప్లెక్స్‌ను పొందవచ్చు.

ప్రస్తుతం ఈ వ్యవసాయం కేవలం ధనవంతులకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. సాధారణ రైతుల్లో దీనిపై ఉన్న అపోహలే ఇందుకు కారణం. దిగుబడి కాస్త తగ్గినా, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటను పండించవచ్చని ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. విషపూరితమైన రసాయనాల కూరగాయల కంటే, ప్రకృతి సిద్ధంగా పండించిన సేంద్రీయ ఆహారాన్ని ఎంచుకుందాం. రేపటి ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు వేద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories