బోడ కాకర సాగుతో బోలెడు ఆదాయం

కూరగాయ పంటల్లో విశిష్ట ఔషద గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా...
కూరగాయ పంటల్లో విశిష్ట ఔషద గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడ కాకర, ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లో విరివిగా సాగు చేస్తున్నారు. రుచికి వగరే అయినా రైతులకు మాత్రం లాభాల తీపిని అందిస్తున్నది ఈ తీగజాతి పంట. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో ప్రస్తుతం చాలా మంది రైతులు సాగు చేసి మంచి లాభాలను పొందుతున్నారు. ఆ కోవలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఔత్సాహిక రైతు బోడ కాకర సాగులో లాభాలు గడిస్తున్నాడు. రైతుకు లాభాలు తెచ్చి పెట్టే బోడకాకర పంట సాగు గురించి ప్రత్యేక కథనం.
ఖమ్మం జిల్లా గోళ్లపాడు గ్రామానికి చెందిన రైతు శ్యామల రామిరెడ్డి గతంలో పలు రకాల కూరగాయల సాగు చేసేవాడు సాధారణ కూరగాయల సాగులో లాభాలు తక్కువుంటున్నాయనే ఉద్దేశ్యంతో తన ఆలోచన బోడ కాకర సాగు వైపు మళ్లింది. అనుకున్నదే తడవుగా ఎకరా పొలంలో గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్నాడు రైతు రామిరెడ్డి.
అటవీ ప్రాంతంలో సాధారణంగా పండే ఈ పంటకు మార్కెట్‌లో ప్రత్యేకంగా విత్తనం లభించదు. చిన్న చిన్న దుంపలు లేదా పండిన కాయల నుంచి గింజలు సేకరించాలి. ఆడ,మగ మొక్కలు వేర్వేరుగా ఉంటాయి. అవి మనకు పూత సమయంలోనే గుర్తించడానికి వీలవుతుంది. మగవాటిని గుర్తించి పది శాతం మాత్రమే ఉండేలా చూసుకుని మిగిలినవి తీసివేయాలని, ఈ బోడ కాకర ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి ఉంటుందని అంటున్నారు ఈ రైతు.
విత్తనం లేదా దుంపల ఖర్చు 2వేలు అవుతుంది అదే అటవీ ప్రాంతంలో సంపాదించుకుంటే ఖర్చు ఉండదు. పొలం తయారీ ఖర్చు 5వేలు. ఎరువుల ఖర్చు పోను ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో కిలో ధర 120 నుంచి 200 వరకు ఉంటుంది. ఎకరానికి ఆదాయం సుమారు రెండు లక్షల దాకా వస్తుందని అంటున్నారు. రైతు శ్యామల రామిరెడ్డితో పాటు తన కుమారుడు రాజశేఖర్ రెడ్డి కూడా బోడ కాకర సాగులో పాలు పంచుకుంటున్నాడు, కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో సొంత గ్రామానికి వచ్చి తన తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. ఇతరాత్ర కూరగాయల సాగు కాకుండా డిమాండ్ ఉన్న ఈ పంట రైతుకు లాభదాయకమని అంటున్నాడు.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT