Farmers Pension Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్.. నెలకు రూ.3,000 పెన్షన్.. ఎలాగో తెలుసుకోండి!

Farmers Pension Scheme
x

Farmers Pension Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్.. నెలకు రూ.3,000 పెన్షన్.. ఎలాగో తెలుసుకోండి!

Highlights

Farmers Pension Scheme: "పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్రం తీపి కబురు! ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజనతో నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అవకాశం. 18-40 ఏళ్ల లోపు రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సమ్మాన్ నిధి నుంచి ప్రీమియం చెల్లించే విధానం, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి."

Farmers Pension Scheme: దేశంలోని అన్నదాతల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి రూ.6 వేలు అందుకుంటున్న రైతన్నలకు కేంద్రం మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న అన్నదాతలకు సామాజిక భద్రత కింద వృద్ధాప్యంలో నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇవ్వనున్నారు. దీనికి సింపుల్ గా ఎలా అప్లై చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన అంటే..

ఇది చిన్న - సన్నకారు రైతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పెన్షన్ పథకం. దీని ద్వారా రైతులకు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3,000 (ఏడాదికి రూ.36,000) పెన్షన్ అందుతుంది. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా బతికేందుకు ఈ పథకం భరోసానిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పథకంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. దీని కోసం రైతులు తమ జేబు నుంచి విడిగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

మీకు వచ్చే రూ.6,000 సమ్మాన్ నిధి నుంచే పెన్షన్ పథకానికి కావాల్సిన నెలవారీ చందాను (Contribution) కట్ చేసుకునే ఆప్షన్‌ను ప్రభుత్వం కల్పించింది. దీని కోసం రైతులు కేవలం వారి అనుమతిని తెలియజేస్తూ ఒక ఫారమ్ పూర్తి చేస్తే సరిపోతుంది.

అర్హతలు & నమోదు వివరాలు ఇవే..

* 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు ఈ పథకంలో చేరవచ్చు.

* మీరు తక్కువ వయస్సులో చేరితే నెలవారీ చెల్లించాల్సిన ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.

* దీనికి మీ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఉంటే చాలు.

* దీనిని మీ గ్రామంలో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించి సులభంగా అప్లై చేసుకోవచ్చు.

ప్రస్తుతం పీఎం కిసాన్ కింద రైతన్నలకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. దీనికి అదనంగా పెన్షన్ సదుపాయాన్ని కూడా జోడించుకోవడం ద్వారా రైతులకు కేంద్ర సర్కార్ మరింత అండగా నిలుస్తూ, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి విశేషంగా సహాయపడతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories