Top
logo

నకిలీ రసాయన మందులతో నష్టపోతున్న పత్తి రైతులు

నకిలీ రసాయన మందులతో నష్టపోతున్న పత్తి రైతులు
X
Highlights

అవి రసాయన మందులు ఆ రసాయన మందులు చల్లితే పంటకు పురుగుపట్టకుండా పూర్తి ధాన్యం చేతికొస్తుందని రైతులు ...

అవి రసాయన మందులు ఆ రసాయన మందులు చల్లితే పంటకు పురుగుపట్టకుండా పూర్తి ధాన్యం చేతికొస్తుందని రైతులు ఆశిస్తుంటారు. కాని నాసిరకం మందులు రైతులను నట్టేట ముంచుతున్నాయి. పసిడి వర్షం కురిపిస్తుందని మందులు చల్లితే పత్తి మొక్కలు మోడుబారుతున్నాయి‌. కాసుల కురుపించాల్సిన పత్తిపంటలు నకిలీ మందులతో రైతులకు కన్నీళ్లను మిగిల్చుతున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పత్తిపంటకు ప్రసిద్ధి చెందిన జిల్లా. జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షల ఎకరాలలో రైతులు తెల్లబంగారం సాగుచేస్తున్నారు. అయితే గత కొన్ని ఏళ్లు పత్తి పంటను చీడలు నాశనం చేస్తున్నాయి. దీంతో పత్తి పంటలను రక్షించుకోవడానికి రైతులు వివిధ రకాల రసాయన మందులను స్ప్రే చేస్తున్నారు. రసాయన మందులు స్ప్రే చేస్తే కీటకాలు, చీడపీడలు దూరం అవుతాయని రైతులు భావించి భారీగా పత్తిపంటలపై రసాయన మందులు చల్లుతుంటారు.

పత్తి పంటలకు వచ్చే చీడ పీడలు వ్యాపారులకు వరంగా మారాయి. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి రసాయన మందులను చల్లుతుంటారు‌. ఇదే అదనుగా భావించి రైతులకు నకిలీ రసాయన మందులు అంటగడుతున్నారు కొందరు వ్యాపారులు. ఈ నకిలీ మందులకు ఊరు, పేరు ఉండదు కానీ బ్రాండెడ్ మందులను పోలి ఉంటాయి. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోని పంట చీడలను తొలగించడానికి నకిలీ రసాయన మందులు రైతులకు అంటగడుతున్నారు.

నకిలీ రసాయన మందులు పిచికారీ చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ‌కొన్ని సందర్భాల్లో అసలుకే ‌మోసం వస్తుంది. కుమ్రంబీమ్ జిల్లా పెంచికల్‌పేట మండలం లోడుపల్లికి చెందిన రైతుకు ఆరు ఏకరాల భూమి ఉంది. అయితే నాలుగు ఎకరాలు ఒకరికి కౌల్‌కు ఇచ్చారు. మిగితా రెండు ఎకరాలలో పత్తి సాగుచేపట్టారు. శంకర్ సాగు చేసిన పత్తికి చీడపీడలు పట్టాయి. దాంతో స్థానికంగా ఉండే‌ ‌మందుల దుకాణంలో రసాయన మందు కొనుగోలు చేసి పత్తికి స్ర్పే చేశాడు. అది నకిలీ మందు కావడంతో పత్తి పూర్తిగా ఎండిపోయింది. దీంతో చేతికొచ్చిన పత్తిని నకిలీ మందు మింగేసిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు నకిలీ మందుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నకిలీ మందుల వల్ల పూత రావడం లేదని కొత్త రోగాలు వస్తున్నాయంటున్నారు. నకిలీ మందులు, పెట్టుబడి వ్యయం భారీగా పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నకిలీ దందా వల్ల వ్యాపారులు కోట్లు గడిస్తున్నా రైతులు మాత్రం తీవ్రంగా ‌నష్టపోతున్నారు. నకిలీ మందులు అమ్మిన వ్యాపారులపై పీడీ కేసులు నమోదు చేయాలని రైతులు సర్కారు ను కోరుతున్నారు.


Web TitleCotton Farmers Problems in Adilabad District of spraying fake pesticides
Next Story