ఆదిలాబాద్ జిల్లాలో తెల్లబోతున్న పత్తి రైతులు

ఆదిలాబాద్ జిల్లాలో తెల్లబోతున్న పత్తి రైతులు
x
Highlights

ఆరుగాలం కష్టపడి పంట పండించిన పత్తి రైతులు తెల్లబోతున్నారు. నష్టపోకుండా చూస్తామని గొప్పలు చెప్పిన అధికారుల మాటలు నెరవేరడం లేదు. సీసీఐ అధికారులు పత్తిని...

ఆరుగాలం కష్టపడి పంట పండించిన పత్తి రైతులు తెల్లబోతున్నారు. నష్టపోకుండా చూస్తామని గొప్పలు చెప్పిన అధికారుల మాటలు నెరవేరడం లేదు. సీసీఐ అధికారులు పత్తిని కొనకుండా కొర్రీలు పెడుతున్నారు. చేసేదీ లేక రైతులు అడ్డీదారులను ఆశ్రయిస్తే, మద్దతు ధర రాక తీవ్రంగా నష్ట పోతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. నెల రోజుల ముందు ప్రారంభం కావాల్సిన కోనుగోల్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రతి ఏటా దసరాకు ముందు కొనుగోలు ప్రారంభమైయ్యేది. అయితే ఈ ఏడాది పత్తి కొనుగోలుపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్‌ రెండవ వారంలో కోనుగోలు చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడిగితే సాంకేతిక కారణాల చెబుతున్నారని వాపోతున్నారు.

జిల్లాలో పత్తిరైతులకు మద్ధతు ధర కల్పించేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈసారి జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారన్న రైతుల, వ్యవసాయ అధికారుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. పండించిన పంట ఉత్పత్తులను మరోసారి ప్రైవేట్‌ వ్యాపారుల చేతిలో పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా అక్టోబరు తర్వాత సీసీఐ కేంద్రాలను ప్రారంభిస్తున్నారని దీంతో వ్యాపారులు, దళారులు లబ్ధి పొందుతున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైన స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories