30 ఏళ్లుగా ఆకుకూరల సేద్యం.. ఏడాదికి రూ.లక్ష ఆదాయం..

30 ఏళ్లుగా ఆకుకూరల సేద్యం.. ఏడాదికి రూ.లక్ష ఆదాయం..
Leafy Vegetables Cultivation: వరి, మొక్కజొన్న ఇలా ఏ పంటలు సాగు చేసినా పంట కాలం ఎక్కువగా ఉంటుంది.
Leafy Vegetables Cultivation: వరి, మొక్కజొన్న ఇలా ఏ పంటలు సాగు చేసినా పంట కాలం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి భారం కూడా పెరుగుతుంది. అందుకే తమకున్న అరెకరం పొలంలో తీరొక్క ఆకుకూరలు ఏళ్లుగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు దంపతులు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో తక్కువ పెట్టుబడితో , నష్టం అనే మాట లేకుండా ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రతి రోజు ఆదాయం పొందుతున్నారు.
మన ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో ఉపకరిస్తాయి. కంటి చూపుతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను ఆకుకూరలు నివారించి మనం ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. మార్కెట్‌లోనూ ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంది. అందుకు అనుగుణంగా ఏడాది పొడవునా తీరొక్క ఆకుకూరలు పండిస్తూ రోజువారీ ఆదాయాన్ని పొందుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామానికి చెందిన మిరియాల రాములు ,రమణ దంపతులు. గత 30 ఏళ్లుగా తమకున్న అరెకం విస్తీర్ణంలో వివిధ రకాల ఆకుకూరలు సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
అరెకరం విస్తీర్ణంలో తోటకూర, పాలకూర, సుక్కకూర, గోంగూర,మెంతి వంటి ఆకుకూరలు పండిస్తున్నారు. ఏడాది పొడవునా ఒక పంట పూర్తికాగానే మరో పంటను సాగు చేస్తున్నారు ఈ దంపతులు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొలంలోనే గడుపుతారు వీరు. వీరితో పాటు వీరి కుమారుడు, కోడలు అందరూ కలిసికట్టుగానే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కష్టపడి పొలం పనులు చేసుకుంటూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆకుకూరలను ప్రతి రోజు ఉదయాన్నే కొత్తగూడెం మార్కెట్ కు తీసుకువెళ్లి వ్యాపారులకు విక్రయిస్తుంటామని రైతు చెబుతున్నారు. ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆదాయం లభిస్తోందంటున్నారు. ఆకుకూరల సాగుతో పాటు పందిరి కూరగాయలైన పొట్ల, చిక్కుడు, సొర, బీర, దొండ, బెండ, వంగ వంటి కూరగాయలు ఇంటి అవసరాలకు పండించుకుంటున్నారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
నుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMTT-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్- సీఎం కేసీఆర్
28 Jun 2022 2:30 PM GMTప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి..
28 Jun 2022 2:18 PM GMTమారుతిని దర్శకుడిగా మార్చిన ప్రజారాజ్యం పార్టీ
28 Jun 2022 2:00 PM GMT