Ankapur Corn : అంకాపూర్ మక్క బుట్టలకు యమ క్రేజ్ !

Ankapur Corn : అంకాపూర్ మక్క బుట్టలకు యమ క్రేజ్ !
x
Highlights

Ankapur Corn : పచ్చి మక్క బుట్టలకు ఆ మార్కెట్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆ మొక్కజొన్న కంకులకు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజీ ఉంటుంది. తాజాగా...

Ankapur Corn : పచ్చి మక్క బుట్టలకు ఆ మార్కెట్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆ మొక్కజొన్న కంకులకు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజీ ఉంటుంది. తాజాగా మొక్కజొన్న కంకుల క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో జాతీయ స్ధాయిలో ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందిన అంకాపూర్ లో మొక్కజొన్న కంకుల సందడి నెలకొంది. మొక్కజొన్న సాగుతో అక్కడి రైతులు సిరుల పంట పండిస్తున్నారు. అంకాపూర్ మార్కెట్ లో మక్కబుట్టల క్రేజీపై. స్పెషల్ స్టోరీ.

నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలోని మార్కెట్ కు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. వర్షాకాలం ఆరంభం నుంచి సుమారు నాలుగు నెలల పాటు ఈ మార్కెట్ లో పచ్చి మక్క కంకుల సీజన్ కొనసాగుతుంది. ఈ సీజన్ కొద్ది రోజుల క్రితం ప్రారంభం అయింది. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారులు ఈ మార్కెట్ కు క్యూ కడుతున్నారు. మొక్క జొన్న పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో పచ్చి బుట్టకు డిమాండ్ పెరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా అంకాపూర్ మార్కెట్ లో వందలాది మంది ఉపాది పొందుతున్నారు. మొక్క జొన్న సాగు చేసిన రైతులకు కనకవర్షం కురుస్తోంది. కరోనా తో సీజన్ ప్రారంభంలో ధరల్లో వ్యత్యాసం ఏర్పడుతున్నా నష్టం కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయని మొక్కజొన్న రైతులు పచ్చి బుట్టల విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు.

అంకాపూర్ పరిసర గ్రామాల్లో పండించిన మొక్కజొన్న కంకులను ఇక్కడికే తెస్తారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర కు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు. లారీలు వ్యాన్లలో తీసుకెళ్లి, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో వీటిని విక్రయిస్తారు. అనేక పోషక విలువలు, ఉన్న మక్క బుట్టలను ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. కంకులను కాల్చుకుని ఉండికించి వడలు వేసుకుని రకరకాల రుచుల్లో ఆస్వాదిస్తారు. అయితే కరోనా టైంలో మక్కలపై అంతగా ఆసక్తి చూపడం లేదంటున్నారు రైతులు. అంతేకాదు ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంతో మొక్కజొన్న సాగు విస్తీర్ణం తగ్గించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోను గత ఏడాది 36వేల ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేసిన రైతులు ఈ సారి కేవలం 12, 972 ఎకరాల్లో మాత్రమే సాగు చేసారు.

అంకాపూర్ పేరు చెబితేనే.. దేశీ చికెన్.. వేడివేడి మక్క వడలు.. కాల్చి అమ్మే కంకులతో నోరూరుతుంటుంది. మక్క వడలతో పాటు మక్క బుట్టల వ్యాపారంతో ఈ గ్రామానికి రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారుల తాకిడి పెరిగింది. ఫలితంగా రైతులు పండించిన పంటకు సిరుల వర్షం కురుస్తోంది.




Show Full Article
Print Article
Next Story
More Stories