అతి తక్కువ నీటి వినియోగంతో పంటల సాగు

అతి తక్కువ నీటి వినియోగంతో పంటల సాగు
x
Highlights

అది ఓ కరవు ప్రాంతం. ఎప్పుడూ వర్షాభావ పరిస్థితులే నెలకొంటాయి. అక్కడ వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది. అడపాదడపా కురిసిన ఆ వర్షపు నీటితోనే ఇక్కడ సాగు...

అది ఓ కరవు ప్రాంతం. ఎప్పుడూ వర్షాభావ పరిస్థితులే నెలకొంటాయి. అక్కడ వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది. అడపాదడపా కురిసిన ఆ వర్షపు నీటితోనే ఇక్కడ సాగు పనులు జరుగుతుంటాయి. అందులోనూ ఉద్యాన పంటల సాగుకు ఇక్కడి రైతులు దూరంగా ఉంటారు. కానీ ఆ రైతు సాహసించాడు. కరవు పరిస్థితును సైతం ఎదురించాడు అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుని ఉద్యాన పంటలను సాగు చేస్తున్నాడు ప్రకాశం జిల్లాలో అతి తక్కువ నీటి వనరులతో ప్రకృతి విధానాలను అనుసరిస్తూ పండ్ల తోటలు, చిరుధాన్యాల సాగుచేస్తున్నాడు రైతు రావిపాటి హనుమంతరావు.

ప్రకాశం జిల్లా ఎనికపాడు గ్రామానికి చెందిన రైతు రావిపాటి హన్మంతరావు. ఈయన వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. హన్మంతరావుకు స్వతహాగా వ్యవసాయం అంటే ఇష్టం. పాలేకర్ ప్రకృతి విధానాల గురిచి తెలుసుకున్న ఈయన రైతు బిడ్డగా తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. 11 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. 30 రకాల ఉద్యానవన పంటలను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. ఏదో ఒక పంటను వేసి ఒకే సీజన్‌లో రైతు ఆదాయాన్ని పొందడం కాదు అన్నం పెట్టే రైతన్నకు ఏడాది పొడవునా ఉపాధి ఉండాలంటారు ఈయన అందుకు అనుగుణంగానే తాను తన వ్యవసాయ భూమిని కొన్ని భాగాలుగా విభజించి వివిధ రకాల పంటలను పండిస్తున్నారు.

50 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రాంతంలోని రైతులు వరిగలను సాగు చేస్తుండేవారు కానీ ఇప్పుడు ఎవరు వీటిని పండించడం లేదు. తిరిగి మన పూర్వపు దేశీ రకాలైన సిరిధాన్యాలు పండించడం రైతులకు అలవాటు చేయాలన్న ఆలోచనతో ముందడుగు వేశారు ఈ రైతు. ప్రయోగాత్మకంగా తన వ్యవసాయ క్షేత్రంలో ఉద్యాన పంటలతో పాటు అండుకొర్రలు, సామలు, కొర్రలు, ఊదలు, సాగు చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో సిరిధాన్యాల సాగు లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు ఈ రైతు. తక్కువ నీటితో వచ్చే పంటలు కాబట్టి. రైతులు నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో వీటిని సాగు చేయాలని పిలుపునిస్తున్నారు.

ఈ ఏడాది ఈ ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో సాగు నీటి సమస్యలు తలెత్తకుండా ఈ రైతు తనకు అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాలను వినియోగించుకుంటున్నారు. అడపాదడపా కురిసే వాననీటిని భద్రపరుచుకునేందుకు పొలంలోనే ఫాం పాండ్ ను నిర్మించుకున్నారు. డ్రిప్ , స్ర్పింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైనవి గో వ్యర్థాలతో తయారైన జీవామృతం, ఘనజీవామృతం వీటిని పొలానికి సరిపడినంత పారించేందకు ప్రత్యేకంగా మూడు ట్యాంకులను తయారు చేసుకున్నారు. ఒక్కో ట్యాంకు కెపాసిటీ వెయ్యి లీటర్లు. మొత్తం మూడు వేల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories