UPSC Notification 2020: యూపీఎస్‌సీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

UPSC Notification 2020: యూపీఎస్‌సీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
x
UPSC Notification
Highlights

UPSC Notification 2020: ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.

UPSC Notification 2020: ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 పోస్టుల భర్తీ చేయనుంది. వీటిలో లెక్చరర్, సైంటిఫిక్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ 10 ఆగస్ట్ 2020న ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా అప్లై చేయడానికి 27 ఆగస్ట్ 2020 చివరి తేదీగా నిర్ణయించారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు అని తెలిపింది. అదేవిదంగా ఆసక్తిగల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేయాలి అని ప్రకటించింది.

ఖాళీల వివరాలు:

* మొత్తం ఖాళీలు : 24

* జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : 14

* సైంటిఫిక్ ఆఫీసర్ : 1

* లెక్చరర్ (ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థటిక్స్) : 3

* లెక్చరర్ (వొకేషనల్ గైడెన్స్) : 2

* లెక్చరర్ (ఫిజియోథెరపీ) : 2

* సబ్ ఎడిటర్ : 2

ఇతర వివరాలు:

* దరఖాస్తు ప్రారంభం: 10 ఆగస్ట్ 2020

* దరఖాస్తుకు చివరి తేదీ: 27 ఆగస్ట్ 2020

విద్యార్హతలు:

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

వయోపరిమితి:

* సబ్ ఎడిటర్, జూనియర్ సైంటిస్ట్ పోస్టులకు 30 ఏళ్లు.

* ఇతర పోస్టులకు 35 ఏళ్లు.

* ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.25.

* మహిళలకు ఫీజు లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories