UGC NET 2020 : మరోసారి UGC NET 2020 పరీక్షలు వాయిదా

Sumitra
Published on: 15 Sept 2020 12:07 PM IST
UGC NET 2020 : మరోసారి UGC NET 2020 పరీక్షలు వాయిదా
X

UGC NET 2020 : ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని అభ్యర్థులు ఎదురు చేస్తున్న జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్‌ పరీక్షలు మరోసారి వాయిదా పడి అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. యూజీసీ నెట్ అర్హత పరీక్షలను దేశంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు ఇతర విద్యాసంస్థల్లో..అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) అర్హత కోసం నిర్వహించనుండగా వాటిని మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూజీసీ నెట్-2020కి సంబంధించిన మొద‌టి విడ‌త పరీక్షలు ఈనెల 16 నుంచి 18 వ‌ర‌కు, అదే విధంగా రెండో విడుత పరీక్షలు ఈనెల 21 నుంచి 25 వ‌ర‌కు జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఆయా పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టీఏ) వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈనెల 16 నుంచి 24 మధ్యలోనే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) పరీక్షలు ఉండటంతో తేదీలు క్లాష్ కాకూడదన్న ఉద్దేశంతోనే యూజీసీ నెట్-2020 పరీక్షలను వాయిదా వేసినట్లు ఎన్‌టీఏ వివరించింది.

ఇకపోతే వాయిదా పడిన యూజీసీ నెట్-2020 ఎంట్రెన్స్ పరీక్షలను ఎన్‌టీఏ ఈనెల 24 నుంచి నిర్వహిస్తామని తన ప్రకటనలో పేర్కొంది. నిజానికి ఈ పరీక్షలు మే, జూన్‌ మాసాల్లోనే జరగాల్సి ఉండగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తుండడంతో వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో ప్రభుత్వం వివిధ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో అదే విధంగా నెట్ పరీక్షలు కూడా సాఫీగా సాగుతాయని ప్రతి ఒక్కరు భావించారు. త్వరలో సబ్జెక్టుల వారీగా షిఫ్ట్ వారీగా షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. https://ugcnet.nta.nic.in/ లేదా https://nta.ac.in/ వెబ్‌సైట్‌లలో అభ్యర్థులు పూర్తి వివరాలను చూడొచ్చు.

Sumitra

Sumitra

Next Story