TS ICET 2020: TS ICET-2020 పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవడానికి ఆఖరు తేది ఎప్పుడంటే..?

TS ICET 2020: TS ICET-2020 పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవడానికి ఆఖరు తేది ఎప్పుడంటే..?
x
ts icet
Highlights

TS ICET 2020: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తరువాత విద్యార్థులకు వారి భవిష్యత్తులో అత్యున్నత స్థాయిలో విద్యను అభ్యసించాలనుకుంటారు. అలా కెరీర్ దిశగా మార్గం సుగమం చేసే కోర్సుల్లో ప్రధానమైనవి..

TS ICET 2020: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తరువాత విద్యార్థులకు వారి భవిష్యత్తులో అత్యున్నత స్థాయిలో విద్యను అభ్యసించాలనుకుంటారు. అలా కెరీర్ దిశగా మార్గం సుగమం చేసే కోర్సుల్లో ప్రధానమైనవి.. ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్), ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయడానికి ప్రతి ఏడాది టీఎస్‌ ఐసెట్‌ పరీక్షలను నిర్వహిస్తారు. అదే విధంగా ఈ ఏడాది కూడా టీఎస్‌ ఐసెట్‌ 2020 పరీక్షలను నిర్వహిస్తుంది. కాగా ఈ ప్రవేశలు రాసేందుకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ పరీక్ష కేంద్రాలను మార్చుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 6వ తేది గడువు విధించారని టీఎస్‌ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

టీఎస్‌ ఐసెట్‌ 2020 వెబ్‌సైట్‌లో అభ్యర్థులు లాగిన్ అయి అందులో ఉన్న ఎడిట్‌ ద టెస్ట్‌ సెంటర్‌ ఆప్షన్‌ ను ఎంచుకోవాలి. ఈ తరువాత వారికి సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాలను సెలెక్ట్ చేసుకుని మార్చుకోవచ్చని తెలిపారు. పూర్తిగా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆగస్టు 5 వరకు రూ.1000 ఆలస్య రుముతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయ పర్యవేక్షణలో టీఎస్‌ ఐసెట్‌- 2020 పరీక్షను నిర్వహించనున్నారని స్పష్టం చేసారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://icet.tsche.ac.in/ లో సరిచూసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories