Bank Of India Recruitement 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Bank Of India Recruitement 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
x
Representational Image
Highlights

Bank Of India Recruitement 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Bank Of India Recruitement 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 28 పోస్ట్లను భర్తీ చేయనుంది అందులో.. జెనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్,క్లెర్క్, వీటిలో 14 క్లర్క్ పోస్టులు, 14 బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టల భర్తీ ఆగస్ట్ 1న 2020 ప్రారంభం కానుంది. అయితే, ఈ పోస్ట్లు అన్ని స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్నారు. అప్లైచేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bankofindia.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీలు - 28

అథ్లెటిక్స్: క్లర్క్- 2, ఆఫీసర్ 2బాక్సింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2

రెజ్లింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2

టేబుల్ టెన్నిస్: ఆఫీసర్ 2

ఆర్చరీ: క్లర్క్- 2, ఆఫీసర్ 2

వెయిట్ లిఫ్టింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2

స్విమ్మింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2

జిమ్నాస్టిక్: క్లర్క్- 2

ముఖ్యమైన వివరాలు:

దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 1

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 16

విద్యార్హతలు:

క్లర్క్ పోస్టుకు 10వ తరగతి.

ఆఫీసర్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ.

స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ వివరాలు:

క్లర్క్ పోస్టుకు స్పోర్టింగ్ ఈవెంట్ / కేటగిరీ డీలో ఛాంపియన్‌షిప్.

ఆఫీసర్ పోస్టుకు స్పోర్టింగ్ ఈవెంట్ / కేటగిరీ ఏ, బీ, సీలో ఛాంపియన్‌షిప్.

వయోపరిమితి:

క్లర్క్ పోస్టుకు 18-25 ఏళ్లు. ఖేలో ఇండియా స్పోర్టింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నవారికి 20 నుంచి 25 ఏళ్లు.

ఇక ఆఫీసర్ పోస్టుకు 18-25 ఏళ్లు.

దరఖాస్తు రుసుము:

జనరల్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.50.

Show Full Article
Print Article
Next Story
More Stories