NEET Result 2020: నీట్ 2020 ఫలితాలు వాయిదా

NEET Result 2020: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం విద్యార్ధులకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్...
NEET Result 2020: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం విద్యార్ధులకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2020 పరీక్షను ఈ ఏడాది కరోనా నేపథ్యంలో కాస్త ఆలస్యంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంట్రెన్స్ ఫలితాలను కూడా మరికొంత ఆలస్యంగా ప్రకటించనున్నారు అధికారులు. అయితే సుప్రీంకోర్టు ఆదేశంతో ఫలితాలు వాయిదా పడ్డాయి. దీంతో నేడు విడుదలవుతాయనుకున్న నీట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. కరోనా బారిన పడి నీట్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు అక్టోబర్ 14న ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి ఆ తరువాత అందరి ఫలితాలను అక్టోబర్ 16న విడుదల చేయవల్సిందిగా ఆదేశించింది. నీట్ ఫలితాలతో పాటు అన్ని సెట్లు (E1- E6, F1- F6, G1-G6, H1-H6) కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ ని కూడా అదే రోజున విడుదల చేస్తారు. ఇక నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ http://ntaneet.nic.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇక దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 13 న నీట్ పరీక్ష నిర్వహించిన అధికారులు ఈ పాటికే ఫలితాలను విడుదల చేయనుండగా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించింది. నీట్-2020 ఫలితాల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్‌సీ, ఏహెచ్ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఇక ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్దులు హాజరయ్యారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి:
ముందుగా నీట్ అధికారిక వెబ్ సైట్ http://ntaneet.nic.in/ లోకి లాగిన్ అవ్వాలి.
తరువాత నీట్ ఫలితాలు అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తరువాత విద్యార్దుల హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేది వివరాలను అందులో నమోదు చేయాలి.
దాంతొ విద్యార్ధుల పరీక్ష ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT