NMDC Hyderabad: ఎన్‌ఎండీసీలో జాబ్స్‌.. చివరి తేదీ జూన్ 16

NMDC Hyderabad: హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ నార్త్‌ కోల్‌ మైన్‌లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Venkata Chari
Updated on: 28 May 2021 10:30 PM IST
Nmdc ‌Hyderabad Recruitment 2021 For 21 Posts
X

ఎన్‌ఎండీసీలో జాబ్స్‌.. చివరి తేదీ జూన్ 16 (ఫొటో ట్విట్టర్) 

NMDC Hyderabad: హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ఎన్ఎండీసీ) నార్త్‌ కోల్‌ మైన్‌లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఎన్‌ఎండీసీ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్, మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, జూన్ 16న చివరి తేదీ అని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలను https://www.nmdc.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

పోస్టుల వివరాలు..

డిప్యూటీ జనరల్ మేనేజర్ (మైనింగ్)- 1

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మైనింగ్)- 1

సీనియర్ మేనేజర్ (మైనింగ్)- 1

సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్)- 2

డిప్యూటీ మేనేజర్ (మైనింగ్)- 1

డిప్యూటీ మేనేజర్ (సర్వే)- 1

మేనేజర్ (ఫైనాన్స్)- 4

మేనేజర్ (మైనింగ్)- 5

మేనేజర్ (కమర్షియల్)- 2

జూనియర్ ఆఫీసర్- 1

షాట్ ఫైరర్- 02

పోస్టుల విభాగాలు: మైనింగ్‌, ఫైనాన్స్‌, కమర్షియల్‌ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

అర్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ పాస్ అయినవారు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తులు మొదలైన తేదీ: మే 27, 2021

చివరి తేదీ: జూన్ 16, 2021

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా..

ఫీజు: ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులకు రూ.500, సూపర్‌వైజర్ గ్రేడ్ పోస్టులకు రూ.250, వర్క్‌మ్యాన్ గ్రేడ్ పోస్టులకు రూ.150

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/

Venkata Chari

Venkata Chari

Next Story