Reliance JIO Recruitments: జియోలో జాబ్స్..

Sumitra
Updated on: 31 Dec 2019 1:17 PM IST
Reliance JIO Recruitments: జియోలో జాబ్స్..
X
ప్రతీకాత్మక చిత్రం

నూతన సంవత్సరం సదర్భంగా జియో మంచి ఆఫర్లనే కాదు, ఇప్పుడు నిరుద్యోగులకు మంచి అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకూ జీయో సంస్థ ఇంటర్నెట్ ప్రపంచంలో తన సత్తా చాటుకుంది. ఇలాంటి కంపెనీలో ఉద్యోగాలు చేయాలని ఎవరికి ఉండదు. అలాంటి వారి కోసమే ఈ సారి భారీగా ఉద్యోగాల భర్తీకి తెరతీసింది. డిగ్రీ, పీజీ విద్యార్హత ఉన్న నిరుద్యోగుల నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ సారి అనుభవం ఉన్న వాళ్లను మాత్రమే కాకుండా ఫ్రెషర్స్‌కు కూడా ఛాన్స్ ఇచ్చింది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జియో ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

పోస్టుల వివరాలు..

జియో పాయింట్ మేనేజర్

♦ సేల్స్ ఆఫీసర్

♦ సీనియర్ ఎంటర్‌ప్రైజ్ సేల్స్ ఆఫీసర్

♦ అసిస్టెంట్ మేనేజర్

♦ డేటా ఇంజినీర్

♦ డెవలపర్ అప్లికేషన్ ఇంజినీర్

♦ బ్యాకెండ్ డెవలపర్

విద్యార్హతలు..

♦ బీఈ/బీటెక్, బీకామ్, బీఎస్సీ, బీసీఏ ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, డిప్లొమా

ఇతర అర్హతలు

♦ కంప్యూటర్ పరిజ్ఞానం

♦ ఇంగ్లిష్ భాషపై పట్టు ఉండాలి.

♦ ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్ వాడకం గురించి తెలిసి ఉండాలి.

వయోపరిమితి..

♦ 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

♦ గరిష్ట వయోపరిమితి నిర్దారించలేదు.


Sumitra

Sumitra

Next Story