నిరుద్యోగులకు శుభవార్త...ఈసీఐఎల్‌లో 82 ఉద్యోగాలు...

నిరుద్యోగులకు శుభవార్త...ఈసీఐఎల్‌లో 82 ఉద్యోగాలు...
x
Highlights

నిరుద్యోగులకు శుభవార్త ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా...

నిరుద్యోగులకు శుభవార్త ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సుమారుగా 82 పోస్టుల్ని భర్తీ చేయనుంది.

ఇసీఐఎల్ విడుదల చేయనున్న మొదటి నోటిఫికేషన్ ద్వారా 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 4న ప్రారంభమైంది. ఈ పోస్టులకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఇంటర్వ్యూ చేసి వారిని నియమించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 2020 జూన్ 11 సాయంత్రం 4 గంటల్లోగా http://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఇక మిగిలిన 12 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020 జూన్ 22 సాయంత్రం 4 గంటల్లోగా ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం http://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత:

*కంప్యూటర్ సైన్స్‌లో 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

*ఒక ఏడాది పని చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

*ఎంపికైనవారికి వేతనం రూ.23,000 లభిస్తుంది.

ఎంపిక విధానం:

*రాతపరీక్ష

*ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఈసీఐఎల్. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories