CSL Job Notification 2020: సీఎస్‌ఎల్‌లో 358 అప్రెంటిస్‌ ఖాళీలు

CSL Job Notification 2020: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న ఎంతో మంది యువత తమ ఉద్యోగాలను పొగొట్టుకుని నిరుద్యోగులుగా మిగిలారు.

Sumitra
Updated on: 22 July 2020 3:11 PM IST
CSL Job Notification 2020: సీఎస్‌ఎల్‌లో 358 అప్రెంటిస్‌ ఖాళీలు
X
CSL Job Notification 2020

CSL job notification 2020: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న ఎంతో మంది యువత తమ ఉద్యోగాలను పొగొట్టుకుని నిరుద్యోగులుగా మిగిలారు. దీంతో ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబాన్ని పోషించలేక, చేతిలో డబ్బులు లేక మానసికంగా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలోనే కొన్ని కంపెనీలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే నిరుద్యోగ యువతకు కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్ శుభవార్త తెలిపింది. సీఎస్ఎల్‌ ఒప్పంద ప్రాతిప‌దికన 358 అప్రెంటిస్‌ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆగస్టు 4, 2020 దరఖాస్తుకు చివరితేదీ. షార్ట్ లిస్టింగ్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://cochinshipyard.com/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు. ‌

ఖాళీల విభాగాలు : వెల్డ‌ర్‌, మెషినిస్ట్‌, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌, ఎల‌క్ట్రిషియ‌న్‌, ఫిట్ట‌ర్‌, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్‌, ప్లంబ‌ర్‌, మెకానిక్ డీజిల్‌, కార్పెంట‌ర్‌, షీట్ మెట‌ల్ వ‌ర్క‌ర్.

ఖాళీల మొత్తం : 358

ట్రేడ్-350.

టెక్నీషియ‌న్-08

నోటిఫికేషన్ ప్రకటన తేదీ : 2020-07-15

దరఖాస్తులకు ఆఖరి తేదీ : 2020-08-04

ఉద్యోగ రంగం : CSL

వేతనం : INR 9000/నెలకి

సంస్థ పేరు : కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్

సంస్థ వెబ్‌సైట్ : https://cochinshipyard.com/

Sumitra

Sumitra

Next Story