తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. TSPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్..

TSPSC Released Another Job Notification for 181 job Vacancies
x

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. TSPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్..

Highlights

TSPSC Notification: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

TSPSC Notification: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో 181 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రేడ్‌-1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (సూపర్‌ వైజర్‌) పోస్ట్‌లు ఉన్నాయి. ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే మహిళలు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 08-09-2022న ప్రారంభమై 29-09-2022తో ముగియనుంది.




Show Full Article
Print Article
Next Story
More Stories