Telangana Govt Jobs 2022: తెలంగాణలో త్వరలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. 9168 గ్రూప్‌-4 ఉద్యోగాలు..!

TSPSC Group 4 Notification 2022 soon in telangana 9168 jobs | Telangana Govt Jobs 2022
x

Telangana Govt Jobs 2022: తెలంగాణలో త్వరలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. 9168 గ్రూప్‌-4 ఉద్యోగాలు..!

Highlights

Telangana Govt Jobs 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది...

Telangana Govt Jobs 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ప్రభుత్వం అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నడుం బిగించింది. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులని పరుగులు పెట్టిస్తుంది. మొదటగా పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌, ఎస్సై నోటిఫికేషన్ ఆ తర్వాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌, ఎక్సైజ్‌, విద్యుత్‌, రవాణా ఇలా అన్ని శాఖల నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.

త్వరలో మరో నోటిఫికేషన్‌ కూడా విడుదలకి సిద్దమైంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుంది. ఇందులోని పోస్టులని ఇంటర్‌ విద్యార్హతతో భర్తీ చేస్తారు. ఇందులో 9,168 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఖాళీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ లాంటి పోస్టులు ఉంటాయి కాబట్టి పోటీ ఎక్కువగానే ఉంటుంది.

సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్- 4 పోస్టులకు అప్లయ్‌ చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఈ పోస్టులు భర్తీ చేసేందుకు ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు వివరాలు అందాయి. ఆర్థిక శాఖ ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతి కూడా ఇచ్చింది. ఇంకా కొన్ని శాఖల నుంచి వివరాలు రావాల్సి ఉంది. ఆర్థిక శాఖ వాటికి కూడా ఆమోదం తెలిపితే టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories