DOST Notification: దోస్త్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. మే 6 నుంచి మొదటి విడుత రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

DOST Notification: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 3 May 2024 4:24 PM IST
Tsche Released Dost 2024 Notification For Degree Admissions
X

DOST Notification: దోస్త్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. మే 6 నుంచి మొదటి విడుత రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

DOST Notification: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దీనిద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, పాలిటెక్నిక్‌లో డీ-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

మూడు విడతల్లో జరిగే ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మే 6 నుంచి ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది దాదాపు నాలుగున్నర లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మొదటి విడుత రిజిస్ట్రేషన్లు మే 6న ప్రారంభమవుతాయి. ఈ నెల 25 వరకు విద్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు మే 15 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చు. జూన్‌ 3న సీట్లను కేటాయిస్తారు. జూన్‌ 4 నుంచి 10వ తేదీ వరకు విద్యర్థులు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

సెకండ్‌ ఫేస్‌ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 4న ప్రారంభమవుతుంది. 13వ తేదీవరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. జూన్‌ 4 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ చేసుకోవచ్చు. ఇక జూన్‌ 18న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో జూన్‌ 19 నుంచి 24వ తేదీలోపు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

మూడో విడుత రిజిస్ట్రేషన్‌ జూన్‌ 19న ప్రారంభమవుతుంది. జూన్‌ 25 వరకు అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అదే నెల 19 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇవ్వవచ్చు. జూన్‌ 29న సీట్లను కేటాయిస్తారు. అదే రోజు నుంచి జూలై 3 వరకు విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. కాగా, మూడో విడుత రిజిస్ట్రేషన్లకు విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. జూలై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story