TS SSC Results 2023: రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. మంత్రి సబిత అధికారిక ప్రకటన..

TS SSC Results 2023: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం(మే 10) విడుదల కానున్నాయి.

Arun Chilukuri
Updated on: 9 May 2023 1:14 PM IST
TS SSC Results 2023 Date has Been Released
X

TS SSC Results 2023: టెన్త్ క్లాస్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల ఎప్పుడంటే..?

TS SSC Results 2023: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం(మే 10) విడుదల కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ, ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన పరీక్షల్లో 4,94,620 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఫలితాల ప్రాసెసింగ్ కూడా ఇటీవలే ముగిసింది. దీంతో ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story