TS Police Recruitment 2022: తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్‌ ఇదే..!

TS Police Recruitment 2022: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే.

Arun Chilukuri
Published on: 4 July 2022 3:56 PM IST
TS Police Recruitment 2022 Exam Dates Released
X

TS Police Recruitment 2022: తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్‌ ఇదే..!

TS Police Recruitment 2022: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. అయితే అభ్యర్థులకు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక సమాచారం అందించింది. రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వైబ్‌సైట్‌ www.tslprb.inలో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఎస్సై పోస్టులకు హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, కానిస్టేబుల్‌ పరీక్షలకు హైదరాబాద్‌ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story