తెలంగాణలో ముగిసిన పోలీస్ ఈవెంట్స్.. క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ రిలీజ్..

తెలంగాణలో ముగిసిన పోలీస్ ఈవెంట్స్.. క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ రిలీజ్..

Arun Chilukuri
Published on: 6 Jan 2023 12:42 PM IST
TS Police Physical Events Completed
X

తెలంగాణలో ముగిసిన పోలీస్ ఈవెంట్స్.. క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ రిలీజ్..

TS Police Events: పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థ్ధులకు డిసెంబర్‌ 8 నుంచి నిర్వహిస్తున్న ఈవెంట్స్‌ బుధవారం ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 12 సెంటర్లలో ఈవెంట్స్ నిర్వహించగా.. 2 లక్షల 7 వేల 106 మంది అభ్యర్ధులు ఈవెంట్స్ కి హాజరు కాగా.. 111209 అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. మొత్తం 53.7 శాతం అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు వెల్లడించింది.

2018-19 నోటిఫికేషన్ లో 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై కాగా.. ఈసారి 53.7 శాతం క్వాలిఫై అయ్యారని తెలిపింది. ఈవెంట్స్ మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాల్లో రికార్డ్ చేసినట్లు తెలిపింది. అయితే, ఈసారి లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్ కి ఒక్కొక్కరికి మూడుసార్లు చాన్స్ ఇచ్చినట్లు తెలిపారు. లాంగ్ జంప్ లో 83శాతం పురుషులు, 80 శాతం మంది మహిళా అభ్యర్ధులు క్వాలిఫై అవగా, షాట్ పుట్ లో 91 శాతం మంది పురుషులు, 96 శాతం మంతి మహిళా అభ్యర్ధులు క్వాలిపై అయ్యారని బోర్డు ప్రకటనలో పేర్కొంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story