TS Police Jobs 2022: పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకి తీపి కబురు.. మరో రెండేళ్లు వయసు పెంచే అవకాశం..!

TS Police Jobs 2022: తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రెండేళ్ల వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 10 May 2022 6:45 PM IST
ts police jobs 2022 the government raising the age limit for police posts by another two years
X

TS Police Jobs 2022: పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకి తీపి కబురు.. మరో రెండేళ్లు వయసు పెంచే అవకాశం..!

TS Police Jobs 2022: తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రెండేళ్ల వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం వారికి గుడ్‌న్యూస్‌ చెప్పడానికి సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే మూడేళ్లు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం మరో 2 ఏళ్లు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే హోంశాఖకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. వీటని పరిశీలించి ప్రభుత్వం సరైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణలో ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్లలో పోలీస్‌ శాఖలోనే ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. 16,587 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి పోటీ ఎక్కువగానే ఉంటుంది. అయితే గత నాలుగేళ్లుగా నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు కొంతమంది ఏజ్‌ లిమిట్‌ దాటిపోయారు. ప్రభుత్వం ఇప్పటికే కే యూనిఫాం పోస్టులకి 3 ఏళ్ల వయోపరిమితి పెంచింది. కానీ ఇంకా దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగులు వీటికి అర్హులు కాలేకపోతున్నారు. వీరందరు ఈ నోటిఫికేషన్‌ కోసమే గత కొన్నిరోజులుగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు.

పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ గత నోటిఫికేషన్లలో ఫైర్, జైల్‌వార్డెన్, ఎక్సైజ్, ఢిప్యూటి జైలర్ వంటి పోస్టులకి వయసు ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు వాటిని కూడా తగ్గించి బోర్డు నోటిఫికేషన్ జరీ చేసింది. దీంతో నిరుద్యోగులు అయోమయంలో పడిపోయారు. దీంతో చాలామంది మరో రెండేళ్లు వయసు పెంచాలని ఆందోళనలు మొదలెట్టారు. సోమవారం డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దాదాపు 200 మంది రోడ్డుపై 30 నిమిషాల పాటు బైఠాయించారు. 20 రోజులుగా మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులను కలుస్తూనే ఉన్నామని, తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోడానికి రెడీ అయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story