తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల

TS Eamcet 2022 Counselling: ఎంసెట్ ఫలితాలు విడుదలైన శుక్రవారంనాడే షెడ్యూల్‌ను ప్రకటించారు

Jyothi
Published on: 14 Aug 2022 1:56 PM IST
TS EAMCET Engineering Counselling Schedule Released
X

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల

TS Eamcet 2022 Counselling: తెలంగాలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 3 విడతల్లో ఇంజినీరింగ్ సీట్లను భర్తీ చేస్తారు. ఎంసెట్ ఫలితాలు విడుదలైన శుక్రవారంనాడే షెడ్యూల్‌ను ప్రకటించారు. మొదటి విడత కౌన్సిలింగ్ ఈనెల 21 నుంచి, రెండో విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 28 నుంచి, తుది విడత కౌన్సిలింగ్ అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్ తొలి వెయ్యి ర్యాంకర్లలో అత్యధికులు జోసా కౌన్సిలింగ్‌లో పాల్గొని, ఐఐటీల్లో సీట్లు పొందుతున్నారు. దాంతో ఇంజినీరింగ్ కాలేజీల్లోని వీరి సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో ఈసారి జోసా కౌన్సిలింగ్‌కు ముందు ఒక విడత, జోసా కౌన్సిలింగ్ తర్వాత రెండో విడత, ఆ తర్వాత మూడొవ విడత కౌన్సిలింగ్ చేపట్టేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

Jyothi

Jyothi

Next Story