TS BC Gurukula Exam 2022: జూన్‌ 5న బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్ష..!

TS BC Gurukula Entrance Exam 2022 up Date News
x

TS BC Gurukula Exam 2022: జూన్‌ 5న బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్ష..!

Highlights

TS BC Gurukula Exam 2022: తెలంగాణలో డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరాలనుకునే బిసీ విద్యార్థులకు జూన్ 5న ఎంట్రన్స్‌ పరీక్ష...

TS BC Gurukula Exam 2022: తెలంగాణలో డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరాలనుకునే బిసీ విద్యార్థులకు జూన్ 5న ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (bc welfare residential institute) కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా బిసి గురుకుల కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం 51905 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో ఇంటర్ కోర్సుల కోసం 45735 మంది దరఖాస్తు చేసుకోగా, మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6170 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.

వీరందరికీ వారి వారి జిల్లా కేంద్రాల్లో జూన్ 5న పరీక్ష నిర్వహిస్తామని మల్లయ్య బట్టు తెలిపారు. బిసీ సంక్షేమ గురుకుల్లో 6, 7, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం జూన్ 2లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 19న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలను mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. లేదా 040-23322377, 23328266 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories