గల్ఫ్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.. TOMCOM ద్వారా దుబాయ్ జాబ్స్

Arun Chilukuri
Published on: 6 Feb 2026 6:35 PM IST
గల్ఫ్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.. TOMCOM ద్వారా దుబాయ్ జాబ్స్
X

విదేశాల్లో ఉద్యోగాలు ఆశిస్తున్న నైపుణ్యం కలిగిన కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ సంస్థ TOMCOM (Telangana Overseas Manpower Company) శుభవార్త అందించింది. దుబాయ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల కోసం పలు విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు TOMCOM వెల్లడించింది.

ఈ నియామకాల్లో భాగంగా క్రింది ఉద్యోగ హోదాలు అందుబాటులో ఉన్నాయి:

షట్టరింగ్ కార్పెంటర్, ఫినిషింగ్ / జిప్సమ్ కార్పెంటర్, జాయినరీ ఫినిషింగ్ కార్పెంటర్, మేసన్ (బ్లాక్ వర్క్ & ప్లాస్టర్), టైల్ & మార్బుల్ మేసన్, జాయినరీ పెయింటర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు AED 1200 నుంచి AED 1800 వరకు జీతం చెల్లించనున్నారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.30,000 నుంచి రూ.45,000 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు సర్టిఫికేట్ ఉన్న నైపుణ్యం కలిగిన కార్మికులు అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 22 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.

ఉద్యోగులతో పాటు రోజుకు 9 గంటల పని సమయం (UAE కార్మిక చట్టం ప్రకారం ఓవర్‌టైమ్ సౌకర్యంతో) కల్పించనున్నారు. అదనంగా ఉచిత వసతి, ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అయితే విమాన టికెట్ ఖర్చు అభ్యర్థి భాద్యతగా ఉంటుందని TOMCOM స్పష్టం చేసింది.

ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన రెజ్యూమ్‌ను

📩 [email protected]కు పంపవచ్చు.

మరిన్ని వివరాల కోసం

📞 94400 49937, 94400 49861, 94400 51452 నంబర్లను సంప్రదించాలని TOMCOM సూచించింది.

ఈ అవకాశాన్ని అర్హత ఉన్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story