Heavy Rains: తెలంగాణలో స్కూళ్లకు వరుసగా 3 రోజులు హాలీడేస్‌.. తిరిగి సోమవారమే..

Three Days Holidays for Schools in Telangana
x

Heavy Rains: తెలంగాణలో స్కూళ్లకు వరుసగా 3 రోజులు హాలీడేస్‌.. తిరిగి సోమవారమే..

Highlights

రేపు గవర్నమెంట్‌ సెలవు, ఎల్లుండి మొహర్రం..

School Holidays: భారీ వర్షాలతో విద్యాసంస్థలకు సెలవు పొడిగించారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం రేపు (శుక్రవారం) కూడా సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నెల 29న (శనివారం) మొహర్రం సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఉంది. ఆ తర్వాత రోజు ఆదివారం. దీంతో.. తిరిగి సోమవారమే బడులు తెరుచుకోనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories