TET Exams: ఏపీలో ప్రారంభమైన టెట్ పరీక్షలు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

TET Exams: ఉ. 9.30 గం. నుంచి మ.12 గంటల వరకు తొలి సెషన్

Jyothi
Published on: 27 Feb 2024 9:43 AM IST
TET Exams Started in AP
X

TET Exams: ఏపీలో ప్రారంభమైన టెట్ పరీక్షలు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

TET Exams: ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో 2 లక్షల 67 వేల 559 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. టెట్‌ మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 వరకు జరుగుతున్నాయి. రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరగనుంది.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 120 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష సరళిని పర్యవేక్షించేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 26 మందిని... 300 మంది అభ్యర్థులకు ఒక డిపార్ట్‌మెంటల్‌ అధికారిని నియమించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలోని పరీక్ష కేంద్రాలకు కూడా డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించారు అధికారులు. హైకోర్టు ఆదేశం మేరకు బీఈడీ అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు, డీఈడీ అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టుల టెట్‌ మాత్రమే రాయాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story