TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

Jyothi
Updated on: 30 May 2023 6:27 PM IST
Telangana SI and Constable Results Released
X

TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

TSLPRB: తెలంగాణలో పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్‌ సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ పోస్టులకు 98,218 మంది ఎంపికైనట్టు తెలంగాణ స్టేట్‌ లెవెల్ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. కానిస్టేబుల్‌ ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 4,564మంది, ఎస్సై సివిల్‌ 43,708 మంది, ఎస్సై ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 1,779 మంది, ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఈ పోస్టుల‌కు సంబంధించి తుది రాత ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల ఓఎంఆర్ షీట్ల‌ను టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో నేటి రాత్రి నుంచి అందుబాటులో ఉంచ‌నున్నారు.

Jyothi

Jyothi

Next Story